Nalgonda: అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల 25 నుంచి బాండ్ల పరిశీలన!

Nalgonda: నల్లగొండ జిల్లా అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల 25 నుంచి పోలీస్ శిక్షణ కేంద్రంలో బాండ్ల పరిశీలన జరగనుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

KARAMPURI MADHU, CHITYALA
Updated on: 24 Nov 2026 1:10 PM IST
Nalgonda
X

Nalgonda: అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల 25 నుంచి బాండ్ల పరిశీలన!

Nalgonda: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు తిరిగి చెల్లింపు ప్రక్రియలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాకు సంబంధించిన అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు తెలిపారు.

నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (మహిళా ప్రాంగణం పక్కన), నల్లగొండలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా మండలాల వారీగా రోజుకు 250 మంది బాండ్ల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

నల్లగొండ జిల్లాలోని బాధితులు తమకు కేటాయించిన మండలాల వారీ తేదీల్లో మాత్రమే పరిశీలన కేంద్రానికి వచ్చి తమ బాండ్లను ధృవీకరించుకోవాలని సూచించారు. బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఒరిజినల్ పత్రాలు, జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని తెలిపారు.

బాండ్ల పరిశీలనకు వచ్చే బాధితులు తమ పరిస్థితిని బట్టి కింది పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలి.

డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే

ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు జిరాక్స్.

బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.

పాస్‌బుక్‌లో ఖాతాదారుని పేరు, బ్యాంకు బ్రాంచ్ పేరు, IFSC కోడ్ స్పష్టంగా ఉండాలి.

డిపాజిటర్ మరణించి, నామిని జీవించి ఉన్నట్లయితే

నామిని సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్.

డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం.

నామిని ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్.

రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం.

నామిని బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.

డిపాజిటర్, నామిని ఇద్దరూ మరణించి ఉన్నట్లయితే

అసలు బాండ్.

చట్టబద్ధ వారసుడు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం.

డిపాజిటర్, నామిని ఇద్దరి మరణ ధృవీకరణ పత్రాలు.

వారసుల ఆధార్, పాన్ కార్డులు.

రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం లేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్.

వారసుల బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.

ఆధార్, పాన్, మరణ ధృవీకరణ, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాల ఒరిజినల్స్ కూడా పరిశీలనకు చూపించాలి.

డిపాజిటర్ జీవించి ఉండి, వారి కుటుంబ సభ్యులు పరిశీలన కేంద్రానికి వచ్చినట్లయితే

డిపాజిటర్ సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్.

డిపాజిటర్ ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్, ఫోటో జిరాక్స్.

కేంద్రానికి వచ్చే కుటుంబ సభ్యుని ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు.

డిపాజిటర్‌తో కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రం.

డిపాజిటర్ అనుమతితో బాండ్ల పరిశీలనకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి.

ఏజెంట్ ద్వారా బాండ్ల సమర్పణ:

ప్రతి బాండ్ ఒరిజినల్‌ను పరిశీలనకు చూపించాలి.

ప్రతి బాండ్‌కు సంబంధించిన కలర్ జిరాక్స్ సమర్పించాలి.

ప్రతి బాండ్‌కు సంబంధించిన లావాదేవీ నంబర్ వివరాలు ఇవ్వాలి.

ఏజెంట్ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్.

ఏజెంట్ బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.

ఏజెంట్ ఫోన్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలు.

సమర్పించిన బాండ్లకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, రికార్డులు పరిశీలన కోసం చూపించాలి.

ఏజెంట్ కోడ్ తప్పనిసరిగా పేర్కొనాలి.

వివరాలు కొరకు సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు 08682-222423

8712670421

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA