Suryapet: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం..అదనపు కలెక్టర్!

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను నిర్వహించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Nov 2026 11:16 AM IST
Suryapet
X

Suryapet: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం..అదనపు కలెక్టర్!

Suryapet: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మైనార్టీ వెల్ఫేర్ డే, భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్ నాయక్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. విద్యాభివృద్ధి, జాతీయ సమైక్యత, మైనార్టీల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిబిసిడబ్ల్యూఓ విశాల్ ధార, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్లు తాహిర్, జహీర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణు, మాజీ కౌన్సిలర్ అంజద్ అలీ, ఖలీల్ అహ్మద్, షేక్ తాహీర్, ఎస్.కె. జహంగీర్, ఖలీద్ అహ్మద్, అస్రార్, కరాటే సయ్యద్, సిద్ధిక్, అస్రార్ నోమాని, డాక్టర్ కృష్ణ బంటు తదితరులు, జిల్లా మైనార్టీ నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA