Suryapet: ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి: ఎస్పీ నరసింహ

Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ అర్జీలను స్వీకరించి, సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 26 Oct 2026 3:10 PM IST
Suryapet
X

Suryapet: ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి: ఎస్పీ నరసింహ

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వినతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సేవలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.

ప్రజా రక్షణ కోసం పోలీసు సిబ్బంది అనుక్షణం విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని, సమస్యలు వచ్చినప్పుడు దాడులకు పాల్పడకుండా ఇరు వర్గాలు పెద్దల సమక్షంలో సామరస్యపూర్వకంగా, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA