Suryapet: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి ఇళ్లలో ఏసీబీ సోదాల కలకలం!
Suryapet: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
Suryapet: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి ఇళ్లలో ఏసీబీ సోదాల కలకలం!
Suryapet: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు చేపట్టారు.
హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ నివాసంతో పాటు సూర్యాపేటలో సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న ఆయన స్వగృహంలోనూ, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి.
యాదగిరికి చెందిన స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్రమాస్తుల నిలవపై ఏసీబీకి అందిన పక్కా సమాచారం ఆధారంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.




