Nalgonda: నకిరేకల్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు!

Nalgonda: మల్లారం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు దాసరి లింగయ్య, కళమ్మలతో పాటు 80 మంది నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 29 Oct 2026 12:38 PM IST
Nalgonda
X

Nalgonda: నకిరేకల్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు!

Nalgonda: కట్టంగూర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు దాసరి లింగయ్య దాసరి కళమ్మ తో పాటు మొత్తం 80 మంది ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL