Miryalaguda: నేడు 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ..హాజరుకానున్న మంత్రులు!
Miryalaguda: మిర్యాలగూడ వెంకటాద్రిపాలెంలో నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నలుగురు మంత్రుల సమక్షంలో శుక్రవారం పంపిణీ చేయనున్నారు.
Miryalaguda: నేడు 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ..హాజరుకానున్న మంత్రులు!
Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో ముందడుగు పడనుంది. మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం సమీపంలో నూతనంగా నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో కూడిన జ్యోతిరావు ఫూలే ఇందిరమ్మ ఇళ్ల కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు.
స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) సమక్షంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు.
అలాగే ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
నిరుపేద కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఒకేసారి 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనుండటంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.




