Nalgonda: నల్లగొండలో వివాహితపై అత్యాచార నిందితునికి 20 ఏళ్ల శిక్ష!
Nalgonda: నల్లగొండ జిల్లా వాడపల్లి పరిధిలో వివాహితను అపహరించి అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు.
Nalgonda: నల్లగొండలో వివాహితపై అత్యాచార నిందితునికి 20 ఏళ్ల శిక్ష!
Nalgonda: భర్త కళ్లెదుటే ఓ వివాహితను అపహరించి బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా, ఆమె ఆభరణాలు దోచుకెళ్లిన దారుణ ఘటనలో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరానికి గాను నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ మహిళా కోర్టు కమ్ IV అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి తీర్పు వెల్లడించారు.




