Chilukuru: ఆచార్యులగూడెంలో 20 మందికి నూతన చేయూత పింఛన్ల మంజూరు!

Chilukuru: చిలుకూరు మండలం ఆచార్యులగూడెంలో దరఖాస్తు చేసుకున్న 22 మందిలో 20 మందికి మంజూరైన నూతన చేయూత పింఛన్ల పత్రాలను సర్పంచ్, నాయకులు బుధవారం పంపిణీ చేశారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 18 Nov 2026 4:19 PM IST
Chilukuru
X

Chilukuru: ఆచార్యులగూడెంలో 20 మందికి నూతన చేయూత పింఛన్ల మంజూరు!

చిలుకూరు: మండలం పరిధిలోని ఆచార్యులగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గతంలో ఆసరా పింఛన్లుగా పిలిచిన వీటిని ప్రస్తుతం చేయూత పింఛన్లుగా అందిస్తున్నారు. గ్రామంలో మొత్తం 22 మంది దరఖాస్తు చేసుకోగా, 20 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి లక్ష్మీ బిక్షం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిలారీశెట్టి రాంబాబు, ఉపసర్పంచ్ నెమ్మది వీరబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైలారిశెట్టి వెంకయ్య, సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి గట్టు లింగయ్య తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD