Miryalaguda: మిర్యాలగూడలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
Miryalaguda: మిర్యాలగూడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 13 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
Miryalaguda: మిర్యాలగూడలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. 13 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో 13 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 13 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు.
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో మహిళలు, ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.ఈ వేడుకలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన సతీమణి మాధవి దంపతులు హాజరయ్యారు. సద్దుల బతుకమ్మ వేడుకలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం పండుగ శోభను సంతరించుకుంది.




