Actor Yash: నా సినిమా ఇష్టపడని వారికి థ్యాంక్స్.. హీరో యష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Actor Yash: డిజాస్టర్ టాక్‌తో టాక్సిక్ నిరాశపరచడంపై యష్ తొలిసారిగా స్పందించారు.
Actor Yash: నా సినిమా ఇష్టపడని వారికి థ్యాంక్స్.. హీరో యష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Actor Yash: భారతీయ సినీ రంగంలో నటీనటుల వ్యక్తిగత మాటలు అలాగే సినిమాల ఫలితాల గురించి చర్చలు నిత్యం జరుగుతుంటాయి. ముఖ్యంగా అభిమానులు ఎంతో ఎదురుచూసిన సినిమాలు నిరాశపరిచినప్పుడు నటులు స్పందించడం చూస్తుంటాం.
ఈ నేపథ్యంలో స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఆయన తొలిసారిగా స్పందించారు. రామాయణ ఈవెంట్‌లో యష్ చెప్పిన మాటలు ప్రస్తుతం సినిమా వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.
డిజాస్టర్ టాక్‌తో టాక్సిక్ నిరాశపరచడంపై యష్ తొలిసారిగా స్పందించారు. నా సినిమాకు మీ ఆదరణ ఉండాలని ఇటీవల ఇక్కడికి వచ్చాను. చిత్రం ఇష్టపడ్డవారికి, ఇష్టపడనివారికీ థ్యాంక్స్. మీరు నాపై ప్రేమతో మూవీ చూసేందుకు వచ్చారు. అది చాలు అని రామాయణ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు.
అటు హీరో యష్‌కు రామాయణంతో మరింత పేరు రావాలని, టాక్సిక్ కోసం 4 ఏళ్లు కష్టపడ్డారని నిర్మాత దిల్ రాజు ప్రశంసించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆర్టిస్టుల కష్టం గురించి నిర్మాతలు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
అభిమానులు కూడా ఈ విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక, రావణుడిగా యష్, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించి, నితిన్ తివారి దర్శకత్వం వహించిన 'రామాయణ - పార్ట్ 1' నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.




