Nidhhi Agerwal: నిర్మాతకు చుక్కులు చూపిస్తున్న నిధి అగర్వాల్

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘తంత్ర 2’ షూటింగ్ వివాదంలో చిక్కుకుంది.

Gagan kumar
Published on: 13 Nov 2026 2:22 PM IST
Nidhhi Agerwal
X

Nidhhi Agerwal: నిర్మాతకు చుక్కులు చూపిస్తున్న నిధి అగర్వాల్

Tantra 2 Movie: టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె తన కొత్త సినిమా కబుర్లతో కాకుండా, షూటింగ్ సెట్స్‌లో నెలకొన్న వివాదంతో హాట్ టాపిక్‌గా మారారు. 2024లో విడుదలై ఆకట్టుకున్న హారర్ థ్రిల్లర్ ‘తంత్ర’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘తంత్ర 2’ చిత్రీకరణకు ప్రస్తుతం బ్రేక్ పడినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వరాహ ఫిల్మ్స్ బ్యానర్‌పై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కొన్ని నెలల క్రితమే ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమై, రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ, తాజాగా ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఊహించని వివాదం ముసురుకుంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, షూటింగ్ విషయంలో నిధి అగర్వాల్ చిత్రబృందానికి పలు కొత్త డిమాండ్లు పెడుతున్నారని, కారణాలు చెబుతూ కొన్ని కీలక షెడ్యూల్స్‌ను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఆమె వ్యవహారశైలి కారణంగా ముందుగా వేసుకున్న చిత్రీకరణ ప్రణాళికలు దెబ్బతిన్నాయని, దీంతో నిర్మాతలు , దర్శకుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆమె నటించిన భారీ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, నిర్మాతలు మంచి పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాకు ఎంపిక చేశారని, అయినప్పటికీ షూటింగ్‌కు సహకరించకపోవడంతో ప్రస్తుతం ‘తంత్ర 2’ చిత్రీకరణ నిలిచిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ‘తంత్ర 2’ ప్రాజెక్ట్‌లో నిధి అగర్వాల్ కొనసాగుతారా? లేక ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసుకుని నిర్మాతలు ముందుకు వెళ్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అయితే, వస్తున్న ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అటు నిధి అగర్వాల్ కానీ, ఇటు చిత్ర నిర్మాతలు కానీ అధికారికంగా స్పందించలేదు. మరి ఈ వివాదంపై అసలు నిజమేంటో తెలియాలంటే చిత్రబృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.