హీరోగా బిగ్గెస్ట్ సూపర్‌స్టార్.. కట్ చేస్తే.. మూవీకి రూ. 1,350 కోట్ల నష్టం.!
Digger movie: హాలీవుడ్ స్టార్ హీరో టాంజ్ క్రూయిజ్ నటించిన డిగ్గర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది.
హీరోగా బిగ్గెస్ట్ సూపర్‌స్టార్.. కట్ చేస్తే.. మూవీకి రూ. 1,350 కోట్ల నష్టం.!
Digger movie: అంతర్జాతీయ సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదలయ్యే సమయంలో బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాలు వస్తుంటాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కొన్ని చిత్రాలు అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూస్తుంటాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒక భారీ డిజాస్టర్ నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా చతికిలపడటంతో నిర్మాణ సంస్థకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం వెలువడింది.
తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్ స్టార్ హీరో టాంజ్ క్రూయిజ్ ప్రధాన పాత్రలో నటించిన 'డిగ్గర్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. కేవలం ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 20 మిలియన్ డాలర్లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ సినిమాను సుమారు 140 మిలియన్ నుంచి 180 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కేవలం నిర్మాణానికే కాకుండా ప్రమోషన్స్ కోసం కూడా మరో 100 మిలియన్ డాలర్లను నిర్మాతలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.
ఈ భారీ బడ్జెట్ సినిమా ఫలితంగా వార్నర్ బ్రదర్స్ సంస్థకు సుమారు 150 మిలియన్ డాలర్ల వరకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీలో లెక్కగడితే ఈ మొత్తం దాదాపు రూ. 1,350 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. పెట్టిన పెట్టుబడిలో కనీసమంత కూడా వెనక్కి రాకపోవడంతో ట్రేడ్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ భారీ నష్టాల కారణంగా ప్రపంచ సినీ చరిత్రలో నిలిచే పెద్ద డిజాస్టర్లలో 'డిగ్గర్' సినిమా ఒకటిగా నిలిచిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అన్ని హంగులతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. సినిమాలోని కథాంశం అలాగే కథనం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో థియేటర్లలో కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. స్టార్ హీరో నటించినప్పటికీ సినిమా రిజల్ట్ ఇలా ఉండటం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరిచింది. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ అలాగే ఇతర రైట్స్‌పై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




