Sex Racket: వ్యభిచార గుట్టు రట్టు.. అడ్డంగా దొరికేసిన హీరోయిన్!

Sex Racket: మహారాష్ట్రలోని థానేలో వ్యభిచార ముఠా గుట్టురట్టు. హిందీ వెబ్‌సిరీస్‌లు, భోజ్‌పురి చిత్రాల్లో నటించిన నటి అరెస్ట్.

Gagan kumar
Published on: 28 Sept 2026 5:35 PM IST
Sex Racket
X

Sex Racket: వ్యభిచార గుట్టు రట్టు.. అడ్డంగా దొరికేసిన హీరోయిన్!

Thane Sex Racket: వెండితెరపై మెరిసే తారల గ్లామర్‌ వెనుక కొన్నిసార్లు విస్మయకరమైన, చీకటి కోణాలు దాగి ఉంటాయి. తెరపై ప్రేక్షకులను అలరించిన ఓ నటి, తెరవెనుక వ్యభిచార కూపంలోకి దిగి పోలీసులకు చిక్కిన ఉదంతం ప్రస్తుతం మహారాష్ట్రలోని థానేలో సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని థానే పరిధిలోని వాగ్లే ఎస్టేట్‌లో ఓ బార్ అండ్ రెస్టారెంట్ కేంద్రంగా వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నట్లు స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందినది.

దీంతో అప్రమత్తమైన అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు ఓ నకిలీ కస్టమర్‌ను పంపే వ్యూహంను రంగంలోకి దించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అసలు గుట్టు రట్టయింది. పోలీసులు ఆ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఆకస్మిక దాడి చేసి, నిర్వాహకురాలిగా ఉన్న సదరు నటిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ నిర్బంధించబడిన ఇద్దరు మహిళలను పోలీసులు సురక్షితంగా రక్షించారు.

ఈ కేసులో అరెస్టయిన నిందితురాలు సాధారణ మహిళ కాదని, గతంలో పలు హిందీ వెబ్‌సిరీస్‌లు, భోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్‌గా నటించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఆమె సుమారు 10 వెబ్‌సిరీస్‌లు, 3 భోజ్‌పురి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించినట్లు అధికారులు వెల్లడించారు.ఒక్కో కస్టమర్ నుంచి సుమారు రూ.25,000 వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఇందులో రూ.10,000 బాధితులకు ఇస్తూ, మిగిలిన రూ.15,000 తానే స్వయంగా నొక్కేస్తున్నట్లు ఆ నటి విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును కేవలం ఇద్దరు మహిళలకే పరిమితం చేయకుండా, దీని వెనుక ఏదైనా పెద్ద వ్యభిచార ముఠా ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రక్షించబడిన ఇద్దరు మహిళలను విచారించి, వారు ఈ చీకటి లోకంలోకి ఎలా వచ్చారనే వివరాలు సేకరిస్తున్నారు.

అరెస్టయిన నటి కాల్ డేటా, సోషల్ మీడియా పరిచయాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.గతంలోనూ ఆమె ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. గ్లామర్ ప్రపంచంలో అవకాశాలు తగ్గి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు ఇలాంటి నేరాల వైపు అడుగులు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.