Sreeleela: 'డేర్ డెవిల్'లో శ్రీలీల.. కయాదు ప్లేస్ 'రీప్లేస్' చేసినట్టేనా.?
Sreeleela: అజిత్ కొత్త మూవీ 'డేర్ డెవిల్'లో హీరోయిన్గా శ్రీలీల ఎంపికైంది. నవంబర్ 2న చెన్నైలో పూజా కార్యక్రమం ఆమె విచ్చేసింది.
Sreeleela: 'డేర్ డెవిల్'లో శ్రీలీల.. కయాదు ప్లేస్ 'రీప్లేస్' చేసినట్టేనా.?
Sreeleela: శ్రీలీల మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. అజిత్ కొత్త మూవీ 'డేర్ డెవిల్'లో హీరోయిన్గా నటించనున్నారు. నిన్న చెన్నైలో జరిగిన ప్రారంభ వేడుకలో డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు ఆమె పాల్గొన్నారు.
కాగా తొలుత శ్రీలీలను తప్పించి కయాదు లోహర్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పూజా కార్యక్రమానికి శ్రీలీల హాజరవడంతో ఆ రూమర్స్‌కు ముగింపు పడింది. అటు వరుస ఫ్లాపులతో తెలుగులో శ్రీలీలకు ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ అవకాశాలు పెరగవచ్చు.
'డేర్ డెవిల్' అజిత్ 64వ చిత్రం. 2025లో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత ఆధిక్ రవిచంద్రన్‌తో ఆయనకు ఇది రెండో సినిమా. అజిత్ భార్య షాలిని బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు ఇదే తొలి సినిమా. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేడుకకు అజిత్ హాజరుకాలేదు.
ఈ సినిమాలో ఉన్నీ ముకుందన్, సునీల్, ప్రభు, ఆర్. పార్థిబన్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్, మలేషియా, బ్యాంకాక్‌లలో షూటింగ్ జరగనుంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి భిన్నంగా అందరినీ మెప్పించే ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని ఆధిక్ చెప్పారు. మేకర్స్ ఈ మూవీని 2027లో థియేటర్లలో రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.




