Sonu Sood: కంగనాపై రెచ్చిపోయిన సోనూసూద్!

Sonu Sood: నేటి తరం యువతను 'గట్టర్ జనరేషన్' అని సంబోధించిన కంగనా రనౌత్ వ్యాఖ్యలపై నటుడు సోనూసూద్ తీవ్రంగా స్పందించారు.

Naresh.k
Published on: 30 July 2026 9:09 AM IST
Sonu Sood
X

Sonu Sood: కంగనాపై రెచ్చిపోయిన సోనూసూద్!

Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. నేటి తరం యువతను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, ప్రజల నుంచే కాకుండా చలనచిత్ర పరిశ్రమ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కంగనా తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇటీవల నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్న యువత ప్రవర్తనపై కంగన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.నేటి యువత ప్రవర్తన, భాష అసహ్యం పుట్టించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల సొమ్ముతో డ్రగ్స్, మద్యం సేవిస్తూ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నేటి తరాన్ని జనరేషన్ గట్టర్ అని పిలుస్తానని.. చదువుల్లో గానీ, ఇంటి బాధ్యతల్లో గానీ వారు ఏమాత్రం రాణించలేకపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న సోనూసూద్‌ను రిపోర్టర్లు ఈ వివాదంపై ప్రశ్నించగా, ఆయన కంగన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మనల్ని ఆదరిస్తున్న యువతే. వారు అండగా నిలిచినంత కాలమే మనకు గుర్తింపు ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా ప్రజలతో మమేకమైనప్పుడే మన ఉనికికి ఒక అర్థం ఉంటుంది. రిపోర్టర్లు కంగన వాడిన గట్టర్ అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించగా, సోనూసూద్ మరింత ఘాటుగా స్పందించారు

ఆమె నిజంగానే ఆ పదాన్ని ఉపయోగించి ఉంటే అది అత్యంత సిగ్గుచేటు.నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడకూడదు. మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.ప్రజలే మన పాలిట దేవుళ్లు.. వారిని గౌరవించడం నేర్చుకోవాలి అని కంగనాకు సూటిగా హితవు పలికారు.

కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దానికి సోనూసూద్ ఇచ్చిన సమర్థవంతమైన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో మార్పు తెచ్చే యువతను ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా చిన్నచూపు చూడటం తగదని సోనూసూద్ వ్యాఖ్యలకు మద్దతుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story