Sandeep Reddy Vanga: స్పిరిట్ తర్వాత పట్టాలెక్కేది ఆ సినిమానే.? తేల్చి చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా...!
Sandeep Reddy Vanga: ప్రభాస్‌తో 'స్పిరిట్' పూర్తయిన వెంటనే రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్ పార్క్' సినిమాను మొదలుపెడతానని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పారు, 'స్పిరిట్' 2027 అక్టోబర్ 29న విడుదల కానుంది.
Sandeep Reddy Vanga: స్పిరిట్ తర్వాత పట్టాలెక్కేది ఆ సినిమానే.? తేల్చి చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా...!
Sandeep Reddy Vanga: 'స్పిరిట్' సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్‌తో 'స్పిరిట్' పూర్తి కాగానే రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్ పార్క్' సినిమాను మొదలుపెడతానని సందీప్ తాజాగా చెప్పారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా 'స్పిరిట్' షూటింగ్‌పైనే దృష్టి పెట్టారు. సందీప్ నెక్స్ట్ సినిమాను మహేశ్ బాబు లేదా అల్లు అర్జున్‌తో తీయనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ ప్రచారానికి ఇప్పుడు తెర పడినట్లయింది. 'స్పిరిట్' తర్వాత 'యానిమల్ పార్క్' ఉంటుందని చిత్ర నిర్మాతలు కూడా గతంలో స్పష్టం చేశారు.
'స్పిరిట్' 2027 అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్‌తో కలిసి సందీప్, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. 'యానిమల్ పార్క్' 2023లో వచ్చిన 'యానిమల్' సినిమాకు సీక్వెల్. తొలి భాగంలో రణ్‌బీర్ కపూర్‌తో పాటు అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ నటించారు. ఆ సినిమా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
సీక్వెల్లో రణ్‌బీర్ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. రష్మిక, త్రిప్తి కూడా తమ పాత్రల్లో తిరిగి కనిపిస్తారని తెలుస్తోంది. ఈ కథను ఇద్దరు సోదరుల మధ్య యుద్ధంగా సందీప్ గతంలో వివరించారు. 'స్పిరిట్' పూర్తయ్యాక ఆరు నెలల విరామం తీసుకుని 'యానిమల్ పార్క్'ను మొదలుపెడతామని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా గతంలో చెప్పారు. రణ్‌బీర్ కూడా 'రామాయణ', 'లవ్ అండ్ వార్' చిత్రాల షూటింగ్‌లను పూర్తి చేయాల్సి ఉంది. దీంతో అభిమానులు రెండు సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.




