లలిత్ మోదీ బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో

Lalit Modi Biopic: లలిత్ మోదీ జీవితం త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.

Srinivas Rao
Published on: 8 Jun 2026 11:16 AM IST
Lalit Modi Biopic
X

లలిత్ మోదీ బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో

Lalit Modi Biopic: ప్రపంచ క్రికెట్ రూపురేఖలను మార్చేసి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనే కనకవర్షాన్ని కురిపించే లీగ్‌ను సృష్టించిన వివాదాస్పద క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ లలిత్ మోదీ జీవితం త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఆయన జీవితం ఆధారంగా ఒక భారీ బయోపిక్ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో లలిత్ మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో తన పాత్రను పోషించడానికి బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ తీవ్ర ఆసక్తి చూపిస్తున్నట్లు మోదీ పేర్కొనడం ఇప్పుడు బి-టౌన్‌లో సెన్సేషన్‌గా మారింది.

లండన్ వెళ్ళి మరి కలిసిన రణ్‌వీర్.. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్!

లలిత్ మోదీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బయోపిక్ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉంది. మాజీ సోనీ అధినేత్రి స్నేహా రజనీ నేతృత్వంలోని ఒక ప్రత్యేక బృందం ఈ కథను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వందలాది గంటల పాటు లలిత్ మోదీని ఇంటర్వ్యూ చేసి వివరాలు సేకరించారు.

ఈ బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్ నటించడంపై మోదీ స్పందిస్తూ.. కొన్ని సంవత్సరాల క్రితం రణ్‌వీర్ సింగ్ స్వయంగా లండన్‌లోని తన నివాసానికి వచ్చి కలిశారని గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో ఎప్పటికైనా ఒక కమిషనర్‌గా లలిత్ మోదీ పాత్రను పోషించాలని రణ్‌వీర్ కోరుకున్నట్లు మోదీ తెలిపారు. అయితే ప్రస్తుతం రణ్‌వీర్ పెద్ద స్టార్ కావడంతో కాల్షీట్లు అడ్జస్ట్ అవుతాయో లేదో చూడాలని, కానీ ఆ పాత్రకు రణ్‌వీర్ అయితేనే పర్ఫెక్ట్ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అండర్ వరల్డ్ బెదిరింపులు.. వివాదాల పుట్ట!

క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగిన లలిత్ మోదీ కెరీర్, ఆ తర్వాత ఆర్థిక అక్రమాలు మరియు అవినీతి ఆరోపణలతో ఒక్కసారిగా వివాదాల మయంగా మారింది. దీంతో ఆయన భారతదేశాన్ని వదిలి లండన్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.

రణ్‌వీర్ సింగ్ ఇటీవల నటించిన యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, లలిత్ మోదీ బయోపిక్‌పై బాలీవుడ్ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ బయోపిక్‌లో కేవలం ఐపీఎల్ సృష్టి మాత్రమే కాకుండా, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం నుండి వచ్చిన ప్రాణభయం , బెదిరింపుల వల్లనే తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి పూర్తిగా తప్పుకోవాల్సి వచ్చిందనే సంచలన నిజాలను కూడా చూపించబోతున్నారట.

అధికారం, అపారమైన డబ్బు, వివాదాలు, అండర్ వరల్డ్ బెదిరింపులు , ప్రవాస జీవితం వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న లలిత్ మోదీ బయోపిక్ గనుక అనుకున్నట్లు తెరకెక్కితే, ఇది బాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ టాక్డ్ అబౌట్ బయోపిక్‌గా నిలవడం ఖాయం.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story