‘రామాయణ’ టీమ్ సరికొత్త బాక్స్ ఆఫీస్ వ్యూహం!

Ramayana: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణ’.

Srinivas Rao
Published on: 23 May 2026 12:12 PM IST
Ramayana
X

‘రామాయణ’ టీమ్ సరికొత్త బాక్స్ ఆఫీస్ వ్యూహం!

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదట 2026 దీపావళి కానుకగా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుకున్న తేదీ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఒక వారం ముందే బాక్సాఫీస్ బరిలోకి?

ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ 'బాలీవుడ్ హంగామా' కథనం ప్రకారం.. ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి రోజున కాకుండా, ఒక వారం ముందే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర తొలి టీజర్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, సినిమాపై ఉన్న అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

నిర్మాత నమిత్ మల్హోత్రా మాస్టర్ ప్లాన్

పండగ సీజన్‌కు ముందే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచన వెనుక నిర్మాత నమిత్ మల్హోత్రా ఒక బలమైన వ్యాపార వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు టాక్. దీపావళి సెలవుల కంటే ఒక వారం ముందే సినిమాను విడుదల చేస్తే, టాక్ ఆధారంగా ప్రేక్షకులలో బలమైన పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు.

నమిత్ మల్హోత్రా దీపావళి పండగ కంటే ముందే సినిమాను మార్కెట్‌లో స్థిరపరచాలని అనుకుంటున్నారు. మొదటి వారం పబ్లిక్ టాక్ , మౌత్ టాక్ గట్టిగా స్ప్రెడ్ అయితే, రెండవ వారం వచ్చే దీపావళి సెలవులను సినిమా పూర్తిగా వాడుకుంటుంది. దీనివల్ల మొదటి వారం కంటే రెండవ వారంలో బాక్సాఫీస్ వసూళ్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి" అని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

త్వరలోనే అధికారిక ప్రకటన

ఈ విడుదల తేదీ మార్పుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. దీనితో పాటు, ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం భారీ ఎత్తున డీల్స్ నడుస్తున్నట్లు సమాచారం. ఈ బిజినెస్ వ్యవహారాలు కొలిక్కి వచ్చిన వెంటనే, అక్టోబర్ 30 విడుదల తేదీపై మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇవ్వనున్నారు. హాలీవుడ్ దిగ్గజ సాంకేతిక నిపుణులు, టాప్ ఇండియన్ స్టార్ కాస్ట్‌తో దాదాపు రూ. 4,000 కోట్ల భారీ వ్యయంతో రెండు భాగాలుగా వస్తున్న ఈ దృశ్య కావ్యం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story