Ramayana: రామాయణం మూవీ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటది.. టికెట్ ధర తెలిస్తే షాక్!

Ramayana: రణ బీర్, సాయిపల్లవి కాంబినేషన్‌లో వస్తున్న రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్లు సాధిస్తోంది.

Ravi
By Ravi
Published on: 24 Oct 2026 5:17 PM IST
Ramayana
X

Ramayana: రామాయణం మూవీ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటది.. టికెట్ ధర తెలిస్తే షాక్!

Ramayana: రణ బీర్ కపూర్ అలాగే సాయిపల్లవి జంటగా నటిస్తున్న రామాయణ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు సృష్టిస్తుంటాయి. తాజా సమాచారం ప్రకారం రామాయణ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 92 వేల టికెట్లు అమ్ముడై రూ. 5.44 కోట్లు కలెక్షన్లు సాధించింది. ముంబై అలాగే ఢిల్లీలో ఈ మూవీ టికెట్ల కోసం ప్రేక్షకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. దీంతో కొన్ని థియేటర్లలో రిక్లానర్ సీటు ధర ఏకంగా రూ. 2,770 వరకు చేరింది. నవంబర్ 5న రిలీజయ్యే ఈ మూవీలో యష్, సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్, రకుల్ ప్రీత్, రవి దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా వంటి దిగ్గజ నటీనటులు ఉండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

చిత్ర పరిశ్రమలో ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు శ్రీకారం చుడుతుందని ట్రేడ్ వర్గాలు వివరిస్తున్నాయి. భారీ తారాగణం అలాగే నిర్మాణ విలువల కారణంగా సినిమాపై నెలకొన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రేక్షకులలో నెలకొన్న ఈ ఆసక్తి సినిమా విజయాన్నే కాకుండా వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించబోయే రికార్డులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.