Ritu Chowdary: రీతూ చౌదరి, డీమోన్ పవన్ బ్రేకప్.. సోషల్ మీడియాలో పవన్ ఎమోషనల్ పోస్ట్..!
Ritu Chowdary: సోషల్ మీడియా పాపులర్ జోడీ రీతూ చౌదరి , డీమోన్ పవన్ విడిపోయారు.
Ritu Chowdary: రీతూ చౌదరి, డీమోన్ పవన్ బ్రేకప్.. సోషల్ మీడియాలో పవన్ ఎమోషనల్ పోస్ట్..!
Ritu Chowdary: సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ పెయిర్‌గా, ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్న జంట రీతూ చౌదరి , డీమోన్ పవన్ తమ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండగా తాజాగా ఆ ప్రచారానికి పవన్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ముగింపు పలికారు. ఇకపై తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, కేవలం స్నేహ బంధం కూడా పూర్తిగా ముగిసిపోయిందని పవన్ ఎమోషనల్ అయ్యారు. తాము సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే కాకుండా, బ్లాక్ కూడా చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
రీతూ చౌదరితో తన సంబంధంపై వస్తున్న ట్రోల్స్, నెగెటివిటీ, ఫేక్ రూమర్లు చాలా దారుణంగా ఉన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో లేదా ఆన్లైన్లో కనిపించేది ఒకలా ఉంటే.. నిజ జీవితంలో జరిగే పరిస్థితులు వేరుగా ఉంటాయి. మేమిద్దరం ఎవరూ ఎవరినీ వాడుకోలేదు. మాది కేవలం ఒక పరస్పర స్నేహబంధం మాత్రమే అని స్పష్టం చేశారు.
గత కొన్ని నెలలుగా వ్యక్తిగత సమస్యలు, పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో.. ఇద్దరి మనశ్శాంతి కోసం వేర్వేరుగా ప్రాజెక్టులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ విడిపోవడమే తమకు సరైన మార్గమని భావించి, ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుని, బ్లాక్ లిస్టులో చేర్చుకున్నట్లు పవన్ వెల్లడించారు. ఎల్లప్పుడూ కలిసికట్టుగా రీల్స్, వీడియోలతో అలరించిన ఈ జోడీ ఇప్పుడు పూర్తిగా విడిపోవడంతో వారి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.




