Pooja Hegde: నా బాడీ స్ట్రక్చర్ నాకే నచ్చేది కాదు.. పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!

Pooja Hegde: తన చిన్ననాటి రూపం, ముక్కు, నవ్వుపై పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు వైరల్.

Gagan kumar
Published on: 6 Nov 2026 12:18 PM IST
Pooja Hegde
X

Pooja Hegde: నా బాడీ స్ట్రక్చర్ నాకే నచ్చేది కాదు.. పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!

Pooja Hegde nose: టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా స్థాయిలో కోట్ల మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన బుట్టబొమ్మ పూజా హెగ్డే తన రూపం గురించి చెప్పిన సంచలన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తెరపై తన అందం, అభినయంతో అదరగొట్టే ఈ భామ.. ఒకప్పుడు తన సొంత రూపాన్ని చూసుకుని తీవ్ర అభద్రతా భావానికి గురయ్యానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా ఒక బ్రాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న పూజా హెగ్డే.. తన చిన్ననాటి జ్ఞాపకాలను, ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను అభిమానులతో పంచుకుంది: నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నా రూపానికి సంబంధించి ఎన్నో విషయాలు నాకే నచ్చేవి కాదు. ముఖ్యంగా నా ఫేస్‌లో ఉన్న ముక్కు, నా నవ్వు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అద్దంలో చూసుకుని ఎంతో బాధపడేదాన్ని. తన రూపం పట్ల అభద్రతతో బాధపడుతున్న సమయంలో ఆమె తండ్రి చెప్పిన మాటలు తన జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చాయని పూజా తెలిపింది:

ఒకరోజు తండ్రి వద్దకు వెళ్లి తన ముఖం, ముక్కు బాలేవని బాధపడగా.. ఆయన ఎంతో ప్రేమగా, దేవుడు నీ ముఖానికి ఏ ముక్కు సరిగ్గా ఇంపుగా ఉంటుందో దాన్నే ఇచ్చాడు. ఒకవేళ పెద్ద ముక్కు నీ ముఖంపై ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో అని సర్ది చెప్పారు. తండ్రి చెప్పిన ఆ ఒక్క మాటతో పూజాకు తన ఫీచర్స్ పట్ల పూర్తి అవగాహన, ఆత్మవిశ్వాసం వచ్చాయి. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఓ మంచి సందేశాన్ని ఇచ్చింది పూజా.

మనం మన గురించి ఆలోచించేటప్పుడు చాలా సున్నితంగా, నెగిటివ్‌గా ఆలోచిస్తాం. అది బాలేదు, ఇది బాలేదు అని మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. కానీ అది అస్సలు మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు నేను అసహ్యించుకున్న నా ముక్కును, నా నవ్వునే ఈరోజు ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం.

గ్లామరస్ క్వీన్‌గా పరిశ్రమలో కొనసాగుతున్న పూజా హెగ్డే బయటపెట్టిన ఈ నిజాలు, ఆమె ఇచ్చిన సెల్ఫ్-లవ్ మెసేజ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆమె ఆలోచనా ధోరణిని నెటిజన్లు ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.