MM Keeravani: 22 కిలోలు తగ్గిన కీరవాణి.. కొత్త లుక్ చూసి ఫిదా అయిన అనుపమ్ ఖేర్!

MM Keeravani: ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఏకంగా 22 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Arun Chilukuri
Published on: 13 Nov 2026 3:43 PM IST
MM Keeravani
X

MM Keeravani: 22 కిలోలు తగ్గిన కీరవాణి.. కొత్త లుక్ చూసి ఫిదా అయిన అనుపమ్ ఖేర్!

MM Keeravani: ఆస్కార్‌ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన శారీరక మార్పుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి పూర్తిగా కొత్త లుక్‌లోకి మారిపోయారు. తాజాగా హైదరాబాద్‌లో కీరవాణిని కలిసిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఆయన మార్పును చూసి ఫిదా అయ్యారు. కీరవాణి పట్టుదల, క్రమశిక్షణ ఎంతో స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించారు.

హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా కీరవాణిని కలిసిన అనుపమ్‌ ఖేర్‌.. ఆ సందర్భానికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన 'ఎక్స్‌' (X) ఖాతాలో పంచుకున్నారు. "కీరవాణి 22 కిలోల బరువు తగ్గడం నిజంగా అద్భుతమైన విషయం. బరువు తగ్గిన తర్వాత ఆయన మరింత ఉత్సాహంగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆయన నడకలోనూ ఒక కొత్త ఉత్సాహం కనిపించింది" అని అనుపమ్ ఖేర్ తన పోస్టులో పేర్కొన్నారు.

సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన కీరవాణి.. ఇప్పుడు తన ఆరోగ్యం విషయంలోనూ పట్టుదల, ఏకాగ్రతతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారని అనుపమ్ ఖేర్ కొనియాడారు. ఆయన జీవితంలో ప్రారంభమైన ఈ కొత్త ఫిట్‌నెస్ ప్రయాణం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కీరవాణి కొత్త లుక్ చూసి అభిమానులు, సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.