OTT: నిరీక్షణ ముగిసింది..ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ సెన్సేషన్!
OTT: ప్రపంచవ్యాప్తంగా రూ.2,500 కోట్లు వసూలు చేసిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ జియో హాట్‌స్టార్‌లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
OTT: నిరీక్షణ ముగిసింది..ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ సెన్సేషన్!
Obsession OTT Release: హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హారర్, థ్రిల్లర్ ప్రియులను వణికించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘అబ్సెషన్’. కేవలం రూ.9 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, థియేటర్లలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా రూ.2,500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ట్రేడ్ విశ్లేషకులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. కర్రీ బార్కర్ అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మైఖేల్ జాన్సన్, ఇండే నవారెట్టే ప్రధాన పాత్రల్లో జీవించేశారు. మనుషుల మనస్తత్వాలు, పిచ్చిగా మారే వ్యామోహం చుట్టూ తిరిగే ఈ కథలోని ట్విస్టులు, భయంకరమైన సన్నివేశాలు ప్రేక్షకులకు సీటు అంచున కూర్చోబెట్టే అనుభూతిని అందించాయి.
ఈ క్రమంలో ఈ సైకలాజికల్ హారర్ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను భయపెట్టేందుకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ అత్యంత భారీ ధరకు సొంతం చేసుకుంది. కేవలం థియేట్రికల్ వెర్షన్ మాత్రమే కాకుండా, థియేటర్లలో సెన్సార్ కాట్లకు గురైన సన్నివేశాలను కూడా కలిపి ‘అబ్సెషన్: ది ఒరిజినల్ అన్‌కట్ వెర్షన్’ పేరుతో ల్యాండ్ చేయబోతున్నారు. అక్టోబర్ 30 నుంచి ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఈ హాలోవీన్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక నిరీక్షణ ముగిసింది.. ఈ హాలోవీన్‌కి ఉన్న ఒక్క కోరిక అన్నీ మార్చేయగలదు అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హారర్, మైండ్ గేమ్‌లతో కూడిన థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఈ అక్టోబర్ 30న జియో హాట్‌స్టార్‌లో ఓ అద్భుతమైన, భయానకమైన అనుభూతి లభించనుంది.




