The Paradise: బాక్సాఫీస్ వద్ద ది ప్యారడైజ్ విధ్వంసం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో నాని సినిమా నయా రికార్డులు

The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

CR Reddy
Published on: 22 Sept 2026 8:18 AM IST
The Paradise
X

The Paradise

The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేశాయి. రాబోయే రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ది ప్యారడైజ్ గురించే చర్చ నడుస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత

సినిమా విడుదలకు ముందే ది ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. బుకింగ్స్ విండో ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు వేగంగా నిండిపోతున్నాయి. ముఖ్యంగా నైజాం రీజియన్‌లో బుకింగ్స్ ప్రారంభం కాగానే హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో హౌస్‌ఫుల్, ఫాస్ట్ ఫిల్లింగ్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకులు ఎగబడి టికెట్లు కొనుగోలు చేస్తుండటంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

24 గంటల్లోనే లక్షలాది టికెట్ల విక్రయం

మొదటి గంటలోనే బుక్‌మైషో, ఇతర యాప్‌లలో వేలాది టికెట్లు అమ్ముడై అఖండ స్పందనను రాబట్టాయి. ఒక్క బుక్‌మైషో ద్వారానే తొలి గంటలో భారీ సంఖ్యలో టికెట్లు బుక్ కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన అధికారిక అనుమతులు రావడంతో బుకింగ్స్ మరింత ఊపందుకున్నాయి. ఫలితంగా కేవలం గత 24 గంటల వ్యవధిలోనే కేవలం బుక్‌మైషో పోర్టల్‌లోనే ఏకంగా 2.02 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై నాని కెరీర్‌లోనే సరికొత్త రికార్డును సృష్టించాయి.

థియేటర్లలో వైల్డ్ సెలబ్రేషన్స్‌కు రంగం సిద్ధం

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని స్వయంగా చెప్పినట్లుగానే, ఈ సినిమా థియేటర్లలో వైల్డ్ ఫైర్‌లా ఉంటుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని నటన మరో లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ది ప్యారడైజ్ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్‌ను షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.