The Paradise movie: నాని ‘ది ప్యారడైజ్’ రివ్యూ..టాక్ ఎలా ఉందంటే..?
The Paradise movie: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ సెన్సార్ పూర్తి చేసుకుని ‘A’ సర్టిఫికెట్ పొందింది.
The Paradise movie: నాని ‘ది ప్యారడైజ్’ రివ్యూ..టాక్ ఎలా ఉందంటే..?
The Paradise censor: నా 18 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇంతగా శ్రమించిన సినిమా మరొకటి లేదు. శారీరకంగా, మానసికంగా 'ది ప్యారడైజ్' నన్ను ఎంతగానో పరీక్షించింది.. నేచురల్ స్టార్ నాని స్వయంగా చెప్పిన ఈ మాటలే ఈ సినిమా రేంజ్ ఏంటో తెలియజేస్తున్నాయి. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’.
తెలంగాణ అండర్‌గ్రౌండ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
యాక్షన్ ప్రియులకు ఈ చిత్రం ఒక పర్ఫెక్ట్ ఫీస్ట్ లా ఉండబోతుందని రామ్-లక్ష్మణ్ వెల్లడించారు. ‘దసరా’ చిత్రంతో పోలిస్తే ఇందులో మూడు రెట్లు భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన స్టంట్స్ కోసం నాని ఎలాంటి డూప్స్, రోప్స్ సాయం తీసుకోకుండా స్వయంగా, రిస్క్ చేసి నటించడం విశేషం. ప్రతి సీన్ అత్యంత సహజంగా రావాలనే ఉద్దేశంతో ఆయన కఠినమైన డైట్, ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుని నూటికి నూరు శాతం శ్రమించారని వారు ప్రశంసించారు.
ఈ చిత్రంలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసేలా బలమైన మదర్ సెంటిమెంట్ ప్రధాన ఆయువుపట్టుగా నిలవనుందని రామ్ లక్ష్మణ్ తెలిపారు. తన తల్లి కోసం పోరాడే ఒక యోధుడిలాంటి పాత్రలో నాని నటన అత్యున్నత స్థాయిలో ఉండబోతోంది.
ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ఒక విప్లవాత్మక, భావోద్వేగభరితమైన చిత్రం. తల్లీకొడుకుల కథతో పాటు, అణచివేతకు గురైన ఒక సమాజం కథ ఇది అని పేర్కొన్నారు. ప్రసిద్ధ కవి కాళోజీ మాటలైన పుట్టుక మనది, చావు మనది, కానీ మన బతుకంతా దేశానిది అనే వాక్యమే ఈ కథకు స్ఫూర్తి అని, దేశం కోసం పోరాడిన ప్రజలకు అదే దేశంలో చోటు లేనప్పుడు తిరగబడటమే ‘ది ప్యారడైజ్’ అసలు కథ అని స్పష్టం చేశారు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఏ స్టార్ హీరో ప్రయత్నించని సరికొత్త గెటప్‌లో నాని ఈ చిత్రంలో కనిపించనున్నారు. ముఖ్యంగా రెండు జడలతో, రగ్గడ్ అండ్ రా లుక్‌లో నాని నడక, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విస్మయపరుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రంలో వయెలెన్స్, ఇంటెన్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసింది. మొత్తంగా 2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోషల్ మీడియాలో వస్తున్న నీటి అడుగున ఫైట్లు, వెయ్యి మందితో పోరాటాలు వంటి వదంతులను కొట్టిపారేసిన చిత్రబృందం.. ఇది పూర్తిగా ఒక వాస్తవిక, భావోద్వేగంతో కూడిన యాక్షన్ కథ అని స్పష్టం చేసింది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న రాబోతున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.




