Box Office: ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్..ఒకేరోజు ఐదు సినిమాలు

Box Office: గాంధీ జయంతి సందర్భంగా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఐదు సినిమాలు పోటీపడుతున్నాయి.

Gagan kumar
Published on: 1 Oct 2026 10:08 AM IST
Box Office
X

Box Office: ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్..ఒకేరోజు ఐదు సినిమాలు

Box Office: Tollywood గాంధీ జయంతి సెలవు దినాన్ని క్యాష్ చేసుకునేందుకు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి ఐదు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. థియేటర్ల పంపకం, భారీ పోటీ నడుమ ఈ వారం బాక్సాఫీస్ లెక్కలు రంజుగా మారాయి. తొలి రోజు ఓపెనింగ్స్ కంటే లాంగ్ వీకెండ్ వచ్చే మౌత్ టాకే ఈ చిత్రాల భవితవ్యాన్ని తేల్చనుంది.

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ :ఈ జాబితాలో అత్యధిక అంచనాలున్న సినిమా ఇదే. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తుండగా, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తుండటం, నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ మద్దతు తెలపడంతో దీనిపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగ్గాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావాలి.

సిగ్మా : మాస్ , యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం పూర్తిగా యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. యువత నుంచి గట్టి మద్దతు లభిస్తేనే సినిమా నిలదొక్కుకుంటుంది.

డోరతి : ఇప్పటికే తమిళంలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై నెటిజన్ల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలుగు ప్రేక్షకులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరం.

అనకాపల్లి & తెల్ల కాగితం: రూరల్ డ్రామా నేపథ్యంలో 'అనకాపల్లి', ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా 'తెల్ల కాగితం' చిత్రాలు చిన్న సినిగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

ఇన్ని కొత్త సినిమాల హోరు మధ్య, గతంలో విడుదలై విజయవంతంగా రన్ అవుతున్న ‘ది ప్యారడైజ్’ కూడా థియేటర్లను పంచుకుంటూ పోటీలో గట్టి పోటీ ఇస్తోంది. విపరీతమైన పోటీ ఉన్న ఈ సమయంలో కేవలం మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రమే విజేతను నిర్ణయించలేవు.

ఏ సినిమాలో నిజమైన దమ్ముంది, ఏ కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందనేది వీకెండ్ పబ్లిక్ టాక్ ద్వారా స్పష్టమవుతుంది. మరి గాంధీ జయంతి వీకెండ్‌లో బాక్సాఫీస్ కిరీటాన్ని ఏ సినిమా దక్కించుకుంటుందో వేచి చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.