Sekhar Master: శేఖర్‌ మాస్టర్‌కు తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్ వద్ద కారును ఢీకొట్టిన లారీ!

Sekhar Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

Arun Chilukuri
Published on: 12 Nov 2026 12:05 PM IST
Sekhar Master
X

Sekhar Master: శేఖర్‌ మాస్టర్‌కు తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్ వద్ద కారును ఢీకొట్టిన లారీ!

Sekhar Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లిన ఆయన, పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా శంషాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నవంబర్ 11 రాత్రి ఓ సినిమా షూటింగ్ ముగించుకుని శేఖర్‌ మాస్టర్ కారులో ప్రయాణిస్తూ తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ వద్దకు రాగానే, ఆయన కారును వెనుక నుంచి వస్తున్న పండ్ల లోడ్‌తో కూడిన లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి శేఖర్‌ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది.

అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో కారులో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే అదృష్టవశాత్తు శేఖర్‌ మాస్టర్‌కు ఎలాంటి పెద్ద గాయాలు కాలేవు. స్వల్ప గాయాలతో ఆయన సురక్షితంగా బయటపడటంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన క్షేమంగా ఉన్నారన్న సమాచారంతో ఊరట చెందారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.