Kangana Ranaut: సీక్రెట్ మ్యారేజ్ రూమర్స్‌పై కంగనా రనౌత్ క్లారిటీ
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో షికారు చేస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది.
Kangana Ranaut: సీక్రెట్ మ్యారేజ్ రూమర్స్‌పై కంగనా రనౌత్ క్లారిటీ
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో షికారు చేస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. ముంబై వీధుల్లో ఆమె మెడలో మంగళసూత్రం, పాపిట్లో సింధూరంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన దృశ్యాలు నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ఆమెకు గుట్టుచప్పుడు కాకుండా పెళ్లయిపోయిందంటూ అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకోవడం ప్రారంభించారు.
వైరల్ వీడియోపై కంగనా స్పందన
ఈ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ కంగనా రనౌత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్లారిటీ ఇచ్చారు. వైరల్ అవుతున్న వీడియోను తన స్టోరీలో పంచుకుంటూ.. తనకు ఎలాంటి వివాహం కాలేదని, అదంతా కేవలం సినిమా షూటింగ్ మేకప్ మాత్రమేనని స్పష్టం చేశారు.
"నేను ప్రతిరోజూ నగర పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. ఎవరో నేను క్యారెక్టర్ మేకప్‌లో ఉన్నప్పుడు ఈ ఫోటోను యాదృచ్ఛికంగా క్లిక్ చేశారు. ఇప్పుడు దానివల్ల నాకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయినా ఒక వివాహిత లుక్‌లో కనిపిస్తే ఇంతలా హంగామా చేయాలా? నటీనటులు తమ కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు పోషిస్తుంటారు. నేను ఎప్పటికీ రహస్యంగా పెళ్లి చేసుకోను, ఇది నా ప్రామిస్" అని కంగనా రాసుకొచ్చారు.
‘క్వీన్’ సీక్వెల్ కోసమే ఈ అలంకరణ!
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. కంగనా ప్రస్తుతం తన కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘క్వీన్’ చిత్ర సీక్వెల్ ‘క్వీన్ ఫరెవర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు వికాస్ బాల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ‘రాణి’ పాత్ర కోసమే ఆమె ఈ సాంప్రదాయబద్ధమైన లుక్‌ను ధరించినట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో విదేశాల్లో సాగిన రాణి కథ, ఈ సీక్వెల్‌లో భారతదేశంలోని ప్రముఖ నగరాల నేపథ్యంలో సాగనుంది.
ప్రస్తుతం కంగనా పార్లమెంట్ సభ్యురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, ఈ చిత్ర షూటింగ్ కోసం ముంబై-ఢిల్లీ మధ్య నిరంతరం ప్రయాణిస్తున్నారు. ఈ తాజా స్పష్టీకరణతో ఆమె రహస్య వివాహంపై వస్తున్న వార్తలకు పూర్తిగా ముగింపు పడినట్లయింది.




