Kalki Two: కల్కి 2లో బాలీవుడ్ నటుడు.. ఇదే ఆయన మొదటి తెలుగు సినిమా.!
Kalki Two: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్రంలో బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
Kalki Two: కల్కి 2లో బాలీవుడ్ నటుడు.. ఇదే ఆయన మొదటి తెలుగు సినిమా.!
Kalki 2: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో కల్కి సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న కల్కి 2 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కల్కి2 చిత్రంలో నటించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రబాస్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆయన ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. తన అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నసీరుద్దీన్ షా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమా స్థాయిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.
ఒకవేళ ఈ వార్త నిజమైతే ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో నసీరుద్దీన్ షా నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కానుంది. టాలీవుడ్ చిత్రసీమలోకి ఆయన అడుగుపెడుతుండటం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్న ఆయన ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు ఈ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే కల్కి 2 సినిమా షూటింగ్ సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి ముప్పై శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం చేతిలో ఉన్న మిగతా చిత్రాల షూటింగ్‌లు అన్నీ పూర్తయిన తర్వాత ఈ మూవీ షూటింగ్ మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంబంధించిన మరిన్ని అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి.




