Jr NTR Anil Ravipudi Movie: ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్.. నవ్వుల విందుకు సిద్ధంకండి!
Jr NTR Anil Ravipudi Movie: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్ ఖరారైంది.
Jr NTR Anil Ravipudi Movie: ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్.. నవ్వుల విందుకు సిద్ధంకండి!
Jr NTR Anil Ravipudi Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికర, క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా, వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ ఎంటర్‌టైనర్ పట్టాలెక్కనుంది. శనివారం ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫొటోను తారక్ 'ఎక్స్' వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ ఎన్టీఆర్.. ‘నవ్వుల విందు సిద్ధమవుతోంది’ అని క్యాప్షన్ జోడించారు. మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్, తనదైన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే అనిల్ రావిపూడి కలయికలో సినిమా రానుండటంతో నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ హీరోలుగా ‘జనవరి 12న విడుదల’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.




