Priya Bhavani Shankar: పెళ్లిపీటలెక్కిన ‘ఇరుముడి’ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. భర్త ఎవరంటే?
Priya Bhavani Shankar: ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు రాజ్‌తో నవంబర్ 11న సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
Priya Bhavani Shankar: పెళ్లిపీటలెక్కిన ‘ఇరుముడి’ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. భర్త ఎవరంటే?
Priya Bhavani Shankar: కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు రాజ్‌తో ఆమె వివాహం నవంబర్ 11న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రియ, రాజ్ ఇద్దరూ కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులుగా ఉన్నారని సమాచారం. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి, సుమారు పదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత వీరు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.
టెలివిజన్ రంగంలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియా భవానీ శంకర్, ఆ తర్వాత వెండితెరకు పరిచయమయ్యారు. తమిళంలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి నటిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన భారీ చిత్రం ‘భారతీయుడు 2’ లోనూ ఆమె కీలక పాత్రలో నటించి మెప్పించారు.
అలాగే, సంతోష్ శోభన్ సరసన ‘కల్యాణం కమనీయం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఆమె, ప్రముఖ ఓటీటీలో వచ్చిన ‘దూత’ వెబ్ సిరీస్‌తోనూ విశేషంగా ఆకట్టుకున్నారు. ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రియా భవానీ శంకర్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ ఒక కొత్త అడుగు వేసి అభిమానులను సంతోషపెట్టారు.




