Hansika Motwani: హన్సిక ప్రైవేట్ వీడియో కలకలం..!

Hansika Motwani: నటి హన్సిక మోత్వాని ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Gagan kumar
Published on: 30 Oct 2026 4:39 PM IST
Hansika Motwani
X

Hansika Motwani: హన్సిక ప్రైవేట్ వీడియో కలకలం..!

Hansika Motwani Private Video: సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అంతే వేగంగా దాని దుర్వినియోగం కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిజమైన వీడియో ఏదో, ఫేక్ ఏదో కనిపెట్టడం గగనంగా మారింది. సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల పిచ్చిలో పడి కొందరు వ్యక్తులు సెలబ్రిటీల ముఖాలను ఇతరుల వీడియోలకు మార్ఫింగ్ చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ వంటి పలువురు కథానాయికలు ఈ డీప్‌ఫేక్ రాయుళ్ల బారిన పడి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రసిద్ధ నటి హన్సిక మోత్వాని పేరు కూడా చేరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గత రెండు రోజులుగా హన్సికకు చెందిన ఒక 'ప్రైవేట్ వీడియో' లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రెడ్డిట్ , ఎక్స్ వేదికల్లో కొందరు నెటిజన్లు దీనిపై రకరకాల పోస్టులు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మీమ్స్, రకరకాల రియాక్షన్ చిత్రాలను జత చేస్తూ ఈ వార్తను మరింత వైరల్ చేస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తే.. హన్సిక ప్రైవేట్ వీడియో లీక్ అయిదనడానికి ఎలాంటి అధికారిక ఆధారాలు కానీ, ప్రామాణికమైన సమాచారం కానీ లేదు.

ఈ ప్రచారాన్ని మెజారిటీ నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కచ్చితంగా సైబర్ నేరగాళ్లు రూపొందించిన డీప్‌ఫేక్ లేదా మార్ఫింగ్ కంటెంట్ అయి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా, ఆధారాలు లేకుండా ఇలాంటి సున్నితమైన విషయాలను వైరల్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. గతంలోనూ పలువురు హీరోయిన్ల విషయంలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు జరిగాయని, కాబట్టి నెటిజన్లు బాధ్యతారాహిత్యంగా వీటిని షేర్ చేయకూడదని సూచిస్తున్నారు.

మరోవైపు హన్సిక వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొంతకాలంగా రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 2022లో ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియాను ఆమె ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి దృశ్యాలు ఓటీటీలో డాక్యుమెంటరీగా కూడా ప్రసారమై విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడిపోయారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న హన్సికను టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఈ లీక్డ్ వీడియో వార్తను తెరపైకి తేవడంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వైరల్ ప్రచారంపై హన్సిక లేదా ఆమె టీమ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనా ఇవ్వలేదు. ఇది పూర్తిగా ఆమె ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగుతున్న కుట్ర అని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంపై హన్సిక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.