Kollywood: సూర్య సినిమాలో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో.? సెట్ అయ్యిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలే!
Kollywood: తమిళ హీరో సూర్య నటించబోయే కొత్త సినిమాలో టాలీవుడ్ స్టార్ గోపీచంద్ విలన్‌గా నటించబోతున్నారని, దీంతో ఆయన కోలీవుడ్‌లో డెబ్యూ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది, అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Kollywood: సూర్య సినిమాలో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో.? సెట్ అయ్యిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలే!
Kollywood: తమిళ హీరో సూర్య నటించబోయే కొత్త సినిమాలో టాలీవుడ్ స్టార్ గోపీచంద్ విలన్‌గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీతో ఆయన కోలీవుడ్లోకి డెబ్యూ చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని ‘DC’ ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
గోపీచంద్ గతంలో 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాల్లో విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం హీరోగా 'భరతవర్ష' సినిమా చేస్తున్నారు. ఇది సూర్య 49వ చిత్రమని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం సూర్య 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 48వ చిత్రం షూటింగ్లో ఉన్నారు. ఆ షూటింగ్ జపాన్‌లో జరుగుతోందని సమాచారం. అది పూర్తయ్యాక అరుణ్ మాతేశ్వరన్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెడతారని, జగరం స్టూడియోస్ దీన్ని నిర్మించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అరుణ్ మాతేశ్వరన్ 'సాని కాయిదం', 'కెప్టెన్ మిల్లర్' చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. 'డీసీ' చిత్రంతో కూడా మంచి పేరు సంపాదించారు. ఈ సినిమాలో 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు కీలక పాత్ర పోషించనున్నారని, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇవేవీ అధికారికంగా ధృవీకరించలేదు. గోపీచంద్ 'భరతవర్ష: సాగా ఆఫ్ శూల' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో రీతూ వర్మ హీరోయిన్. అనూప్ దేవ్ సంగీతం, సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మేకర్స్ ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. ఈ సినిమాకు శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మాత.
గోపీచంద్ గతంలో కూడా ప్రతినాయకుడి పాత్రలో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా హీరోగా ఆయన హిట్ కొట్టలేకపోవడంతో విలన్ పాత్రలు మళ్లీ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ వార్త నిజమైతే సూర్య-గోపీచంద్ ఫేస్ ఆఫ్ ఇరు భాషల అభిమానులకు విందుగా మారుతుంది.




