Sara Ali Khan: కేదార్‌నాథ్ దర్శించుకుందని హీరోయిన్‌కు ఫత్వా జారీ చేసిన ముస్లిం సంఘం..!

Sara Ali Khan: కేదార్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌పై ఇస్లామిక్ మత గురువు ఫత్వా జారీ చేశారు.

Gagan kumar
Published on: 31 Oct 2026 3:38 PM IST
Sara Ali Khan
X

Sara Ali Khan: కేదార్‌నాథ్ దర్శించుకుందని హీరోయిన్‌కు ఫత్వా జారీ చేసిన ముస్లిం సంఘం..!

Sara Ali Khan: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కేదార్‌నాథ్ ఆలయ సందర్శన మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్న ఆమెకు వ్యతిరేకంగా ఇస్లామిక్ మత గురువు, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఫత్వా జారీ చేశారు.

అక్టోబర్ 25న కేదార్‌నాథ్ చేరుకున్న సారా అలీ ఖాన్, సాధారణ భక్తురాలిలా క్యూ లైన్‌లో నిలబడి శివుడిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల అభిమానులతో సరదాగా గడుపుతూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం వేరే మత విశ్వాసాలు, ఆచారాలలో పాల్గొనడం నిషిద్ధమని, సారా చేసిన పని తీవ్రమైన పాపం అని మౌలానా షహాబుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సారా వెంటనే అల్లాకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి అమృతా సింగ్‌ల కుమార్తె అయిన సారా అలీ ఖాన్‌కు కేదార్‌నాథ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె సినీ రరంగప్రవేశం చేసిన మొదటి చిత్రం పేరు కూడా 'కేదార్‌నాథ్'. ఆ సినిమా చిత్రీకరణ అంతా ఈ క్షేత్ర పరిసరాల్లోనే జరగడంతో, దైవిక ప్రశాంతత కోసం ఆమె సమయం దొరికినప్పుడల్లా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. పలుమార్లు ఆమె ఇక్కడకు రాగా, కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.

ఈ వివాదంపై బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ స్పందిస్తూ కీలక సమాచారం వెల్లడించింది. ఆలయ నిబంధనల ప్రకారం హిందూయేతరులు ప్రవేశించేటప్పుడు ఇవ్వాల్సిన ధృవీకరణ పత్రాన్ని సారా బృందం ముందుగానే సమర్పించిందని కమిటీ సీఈఓ సోహన్ సింగ్ రంగర్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సారాకు మతాల అతీతమైన విశ్వాసం ఉందని, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని చాలామంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ వివాదంపై గానీ, తనపై వచ్చిన ఫత్వాపై గానీ సారా అలీ ఖాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.