Drinker Sai: ఓటీటీలో ‘డ్రింకర్ సాయి’ హవా.. జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్‌గా దూసుకుపోతున్న మాస్ ఎంటర్‌టైనర్!
Drinker Sai: థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న యువ హీరో ధర్మ మహేష్ 'డ్రింకర్ సాయి' సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.
Drinker Sai: ఓటీటీలో ‘డ్రింకర్ సాయి’ హవా.. జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్‌గా దూసుకుపోతున్న మాస్ ఎంటర్‌టైనర్!
Drinker Sai: యువ నటుడు ధర్మ మహేష్ హీరోగా, కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘డ్రింకర్ సాయి’. “బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో థియేటర్లలో విడుదలై యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లోనూ తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ‘ఫ్రీ ఆన్ జీ5’ (Free on ZEE5) విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా నిలిచి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
సినిమా మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించిన హీరో ధర్మ మహేష్ నటనపై సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక సాధారణ యువకుడి జీవితంలో ఎదురయ్యే ప్రేమ, ఆత్మగౌరవం, ఆవేశం, బాధ, తిరుగుబాటు స్వభావం వంటి విభిన్న భావోద్వేగాలను ఆయన ఎంతో నేచురల్‌గా పండించారు. కొన్ని కీలకమైన లవ్ అండ్ ఎమోషనల్ సీన్లలో ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కాగా, ఈ చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గానూ దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో ధర్మ మహేష్ 'బెస్ట్ డెబ్యూ యాక్టర్' (Best Debut Actor) గా గామా (GAMA) అవార్డును అందుకోవడం విశేషం.
ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథానాయికగా నటించిన ఐశ్వర్య శర్మ తన అందం, అభినయంతో మెప్పించడమే కాకుండా హీరోతో పండించిన లవ్ కెమిస్ట్రీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మిగతా పాత్రల్లో రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ తమ నటనతో కథను మరింత బలోపేతం చేశారు.
దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి నేటి తరం యువత ఆలోచనలకు తగ్గట్టుగా వినోదాన్ని, ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు శ్రీవసంత్ అందించిన చార్ట్‌బస్టర్ సాంగ్స్, ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రాణప్రదంగా నిలిచాయి.
ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఉచితంగా (Free) అందుబాటులో ఉన్న 'డ్రింకర్ సాయి' చిత్రానికి రోజురోజుకూ ఆదరణ మరియు వ్యూస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, సినిమాను ఇంకా వీక్షించని ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వెంటనే జీ5 యాప్‌లో చూసి ఎంజాయ్ చేయాలని చిత్ర బృందం కోరుతోంది.




