Dragon Movie: డ్రాగన్ కోసం 'ధురంధర్' కంపోజర్.? ఎన్టీఆర్ సినిమాలో డబుల్ ట్రీట్!
Dragon Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్'కు రవి బస్రూర్‌తో పాటు శాశ్వత్ సచ్‌దేవ్ కూడా సంగీతం అందిస్తారని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Dragon Movie: డ్రాగన్ కోసం 'ధురంధర్' కంపోజర్.? ఎన్టీఆర్ సినిమాలో డబుల్ ట్రీట్!
Dragon Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' మూవీపై మరో అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా, మరో సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. రవి బస్రూర్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తారు. సచ్‌దేవ్ కొన్ని సాంగ్స్‌ను కంపోజ్ చేస్తారని తెలుస్తోంది. దీంతో సినిమాకు డబుల్ మ్యూజిక్ పవర్ రానుంది.
శాశ్వత్ సచ్‌దేవ్ ధురంధర్ 1, 2, కిల్, కేసరి-2 వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. 'ఉరి', 'ఆర్టికల్ 370'లకు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న సంగీత దర్శకుడు తోడవడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, ఆశుతోష్ రాణా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టొవినో థామస్ కూడా నటిస్తున్నారనే వార్తలు ఉన్నాయి. హై ఎనర్జీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, భుజానికి సర్జరీ చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నిర్మాత మైత్రీ రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం, షూటింగ్ కొద్ది రోజుల్లో మళ్లీ మొదలవుతుంది. 2027 ఫిబ్రవరి వరకు పెద్ద బ్రేక్‌లు లేకుండా చిత్రీకరణ కొనసాగించాలని టీమ్ ప్లాన్ చేసింది. 'డ్రాగన్' 2027 జూన్ 11న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.




