Dimple Hayathi: ఐటమ్ సాంగ్‌లో డింపుల్ హయాతి...ఏ హీరోతోనో తెలుసా..?

Dimple Hayathi: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శకుటుంబం’ చిత్రంలో గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం.

Gagan kumar
Published on: 17 Sept 2026 10:12 AM IST
Dimple Hayathi
X

Dimple Hayathi: ఐటమ్ సాంగ్‌లో డింపుల్ హయాతి...ఏ హీరోతోనో తెలుసా..?

Venkatesh: వెండితెరపై తన గ్లామర్‌తో, అదిరిపోయే డాన్స్‌లతో యూత్‌ను ఉర్రూతలూగించే క్రేజీ అండ్ బోల్డ్ బ్యూటీ డింపుల్ హయాతి మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తనదైన అందం, ప్రత్యేకమైన అభినయంతో టాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. అందాల ఆరబోతతో పాటు మాస్ బీట్స్‌కు చిందేయడంలో దిట్ట అయిన డింపుల్ హయాతి.. తాజాగా టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్‌లో భాగం కాబోతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి.

విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదర్శకుటుంబం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

ముఖ్యంగా, ఇటీవలు విడుదలైన టీజర్‌తో సినిమాలోని అసలు మజాను పరిచయం చేశారు మేకర్స్. సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్‌గా ఉండే వెంకీ.. తన భార్య అప్పుల బాధ తట్టుకోలేక విలవిల్లాడటం, సరిగ్గా అలాంటి వ్యక్తికి ఊహించని విధంగా లాటరీ తగిలితే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే విభిన్నమైన పాయింట్‌కు త్రివిక్రమ్ మార్క్ కామెడీని జోడించి టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ కాన్సెప్ట్ ప్రస్తుతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేథా పేతురాజ్, యువినా పార్థవి, రాజా ప్రైవల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ తారాగణంతో కళకళలాడుతున్న ఈ ప్రాజెక్టులోకి తాజాగా గ్లామర్ బ్యూటీ డింపుల్ హయాతి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, ఈ సినిమాలో ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండబోతుండగా.. ఆ పాటలో డింపుల్ హయాతితో పాటు మరో టాలెంటెడ్ బ్యూటీ నివేథా పేతురాజ్ కూడా కలిసి స్టెప్పులు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకే పాట్లో ఈ ఇద్దరు గ్లామర్ క్వీన్స్ సందడి చేయబోతున్నారనే వార్త సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఇలాంటి కనులవిందైన సర్ప్రైజ్‌లతో రాబోతున్న ‘ఆదర్శకుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. అక్టోబర్ 2న థియేటర్లలో ఈ నవ్వుల విందును ఆస్వాదించడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.