Dhurandhar 2 Collections: దూకుడు తగ్గని దురంధర్..11 రోజులు.1361 కోట్లు
Dhurandhar 2 Collections:దురంధర్ 2 సినిమా విడుదలైన 11వ రోజున కూడా తన కలెక్షన్ల సునామీని కొనసాగిస్తూనే ఉంది. దానిలో పెద్ద పెద్ద సినిమాల రికార్డులు కొట్టుకుపోతున్నాయి
Dhurandhar 2 Collections
Dhurandhar 2 Collections: ధురందర్ 2 మూవీ రెండో వీకెండ్ కూడా తన హవాను కొనసాగించింది. ఈ సినిమా మొదటి వీకెండ్ లో మంచి వసూళ్లను రాబట్టింది. రెండవ వారంలో కూడా అదే జోరును కొనసాగించింది. ఈ మూవీ రెండవ ఆదివారం 68 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ప్రభంజనం చూసి సినీ విశ్లేషకులు విస్తుపోతున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 5న విడుదలైన హిట్ చిత్రం 'ధురందర్' తర్వాత, 'ధురందర్ 2' సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్ వారిని నిరాశపరచలేదు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ తో మరింతగా ప్రేక్షకులకు థ్రిల్ పంచారు. రణవీర్ సింగ్ అద్భుతమైన నటన కూడా మూవీని మరో మెట్టు ఎక్కించింది.
1300 కోట్లు దాటి..
‘ధురందర్ 2' భారత్ లో 11రోజుల్లో రూ. 1,011 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం నెట్ వసూళ్లు రూ. 846 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాస్ వసూళ్లు రూ. 1,361 కోట్లు. 'ధురందర్ 2' ఇప్పటికే 'కేజీఎఫ్ 2' రికార్డును బద్దలు కొట్టింది. 'కేజీఎఫ్ 2' లైఫ్ టైమ్ కలెక్షన్స్ సుమారు రూ. 1,250 కోట్లు. 'ధురందర్ 2' కేవలం 11 రోజుల్లోనే దానిని అధిగమించింది. ఈ చిత్రం మొత్తం కలెక్షన్స్ పై కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఒక్క మన దేశంలోనే రూ. 1500 కోట్లు సంపాదించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అది సరికొత్త చరిత్ర అవుతుంది.
'ధురందర్ 2' చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటించగా, సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మూవీపై మొదటి నుంచి పాజిటివ్ టాక్ రాన్ అయింది. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేశారు. పరిశ్రమలో కూడా ఈ మూవీపై అదేరకమైన అంచనాలు వచ్చాయి. దీంతో ఈ మూవీతో పాటు రిలీజ్ కావలసిన టాక్సిక్ వంటి సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నారు మేకర్స్. అలా అందరి అటెన్షన్ సాధించిన దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద కానీ, వినీ ఎరుగని సంచలనం సృష్టించింది. విడుదలైన దగ్గర నుంచి ఇప్పటివరకూ బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించిన అన్ని సినిమాలను దాటుకుంటూ దూసుకుపోయింది. కాసుల వర్షం అనేకంటే కరెన్సీ సునామీగా దురంధర్ 2విజయాన్ని చెప్పవచ్చు.




