Hero 3rd Marriage: ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో

Hero 3rd Marriage: గౌరీ స్ప్రట్ అనే మహిళతో ప్రేమలో ఉన్న అమీర్.. జులై 5న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Naresh.k
Published on: 4 Jun 2026 9:24 AM IST
Hero 3rd Marriage
X

Hero 3rd Marriage: ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో

Aamir Khan: బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అమీర్ ఖాన్ సినిమాల గురించే కాదు.. ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా నెట్టింట నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. 1973లో ‘యాదో కీ భారత్’ చిత్రంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారి, చివరకు ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీని ఊపేసిన అమీర్.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే అత్యంత ధనవంతులైన స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆయన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి?

అమీర్ ఖాన్ గతంలో 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2002లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకోగా.. వీరికి ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. కానీ 16 ఏళ్ల వివాహ బంధం తర్వాత వీరిద్దరూ కూడా విడిపోయారు. రెండు విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న అమీర్ ఖాన్.. ప్రస్తుతం గౌరీ స్ప్రట్ అనే మహిళతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే ఈ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాక్.

జులై 5న రిజిస్టర్ మ్యారేజ్?

తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. అమీర్ ఖాన్, గౌరీ స్ప్రట్ వివాహం జులై 5న అత్యంత సింపుల్‌గా జరగనుందని తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అమీర్ నివాసంలోనే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలపై అమీర్ ఖాన్ కానీ, గౌరీ స్ప్రట్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మెగా వెడ్డింగ్‌కు బాలీవుడ్ సాక్ష్యం కానుంది.






Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story