Bigg Boss Telugu 10: వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారం రసవత్తరంగా సాగుతోంది.

Gagan kumar
Published on: 10 Oct 2026 11:26 AM IST
Bigg Boss Telugu 10
X

Bigg Boss Telugu 10: వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్!

Bigg Boss Telugu 10: తెలుగు పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంతో రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో, ఇప్పటికే విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుని.. ఐదో వారం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఆటలు, పాట్లు, గొడవలు, ఎమోషన్స్‌తో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.

ఈ సీజన్‌లో మొదటి వారంలో నటి ఛైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా, రెండో వారంలో నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారంలో బిగ్ బాస్ ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అయితే, నాల్గవ వారంలో అనూహ్య పరిణామాల మధ్య సృష్టి హౌస్ వీడాల్సి వచ్చింది.

ఇప్పుడు ఐదో వారం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా.. వీరిలో అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ వారం హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందనే వార్తలు టెలివిజన్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీకెండ్ ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లనుండటంతో ఎలిమినేషన్ హీట్ పెరిగింది.

బిగ్ బాస్ షోలో ఐదో వారం వచ్చిందంటే ప్రేక్షకులకు మరో బిగ్ సర్ప్రైజ్సిద్ధంగా ఉంటుంది. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. పదో సీజన్‌లోనూ హౌస్‌లో ఉత్సాహం నింపడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈసారి ఏకంగా ఐదారుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ వైల్డ్ కార్డ్ లిస్ట్‌లో ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, డ్యాన్సర్‌ పేరు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు.. అందాలభామ శ్వేతా నాయుడు.

ప్రముఖ డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన శ్వేతా నాయుడు.. కంటెస్టెంట్‌గా, టీమ్ లీడర్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా 'ఢీ 17' సీజన్‌లో రన్నరప్‌గా నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా, పంచ్ డైలాగ్స్‌తో, హైపర్ ఆది వంటి స్టార్ కమెడియన్లతో ఆమె వేసే కామెడీ పంచులు షోకి మరింత హైలైట్‌గా నిలిచాయి.

సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డ్యాన్స్ రీల్స్, ట్రావెల్ వ్లాగ్స్‌తో ట్రెండింగ్‌లో ఉంటారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సేతో కలిసి ఆమె చేసిన కవర్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. గతంలోనే ఆమె ఎంట్రీపై అనేకసార్లు రూమర్స్ వచ్చినప్పటికీ.. ఈసారి సీజన్ 10లో వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె ఎంట్రీ ఖరారైనట్లు గట్టిగా వినిపిస్తోంది.

శ్వేతా నాయుడుతో పాటు మరికొద్ది మంది సెలబ్రిటీలు కూడా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ జాబితాలో.. నీతు నటరాజ్, శివ్ కుమార్, నవరసాలు ఆర్కే, కావ్య శ్రీ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి వస్తే ఆట రూపురేఖలు ఎలా మారుతాయి..? ప్రస్తుతం హౌస్‌లో ఉన్న పాత కంటెస్టెంట్లకు వీరు ఎలాంటి పోటీ ఇస్తారనేది వేచి చూడాలి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో ఎవరు బయటకు వెళ్లనున్నారో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.