Bigg Boss 10: శాలినిపై నాగార్జున ఫైర్.. అమన్, రోహిత్‌కు కూడా గట్టి షాక్

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10 ఆరో వారం ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లకు క్లాస్ పీకారు. నో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇస్తూ శాలినిని సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు.

CR Reddy
Published on: 18 Oct 2026 8:10 AM IST
Nagarjuna
X

Nagarjuna 

Bigg Boss 10: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న 'బిగ్ బాస్ తెలుగు 10' సీజన్ ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా సాగింది. హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌కు గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా రూల్స్ అతిక్రమిస్తూ నామినేషన్ల ప్రక్రియ గురించి ముందస్తుగా చర్చించినందుకు శాలిని, అమన్ అలాగే రోహిత్‌లపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే హెచ్చరించినా తీరు మారకపోవడంతో ఈ ముగ్గురూ రాబోయే కెప్టెన్సీ కంటెండర్స్ రేసులో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతున్నారని కఠినమైన శిక్ష వేశారు. దీనితో పాటు తోటి కంటెస్టెంట్ త్రిగుణ్ పట్ల శాలిని వాడిన అసభ్యకర పదజాలాన్ని నాగార్జున నిలదీశారు. మొదట తప్పించుకోవాలని చూసిన శాలిని, ఆ తర్వాత తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు కోరింది. అలాగే అమన్ కూడా తన భాషను స్లాంగ్ అని సమర్థించుకోవడానికి ప్రయత్నించగా హోస్ట్ మందలించారు.

ఆరో వారం ఎలిమినేషన్‌లో మెగా ట్విస్ట్

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని ప్రచారం జరిగినప్పటికీ మేకర్స్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలాంటి ఎలిమినేషన్ లేదని సమాచారం. ఓటింగ్‌లో అత్యంత తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో నిలిచిన శాలిని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున స్టేజ్ పై నాటకీయంగా ప్రకటించారు. ఆమె ఎలిమినేట్ అయినట్లు నమ్మించి, స్టేజ్ మీదకు పిలిచి జర్నీ వీడియో కూడా ప్లే చేశారు. అయితే ఆమెను నిజంగా ఇంటికి పంపించకుండా హౌస్‌లోని అత్యంత రహస్యమైన సీక్రెట్ రూమ్‎లోకి పంపించారు. ఒకటి రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆమె తిరిగి హౌస్‌లోకి అడుగుపెట్టనుంది.

స్టేజ్ పై రోహిత్‌కు ప్రపోజల్ అలాగే భావోద్వేగాలు

ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో మరొక హైలైట్ ఏంటంటే, హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్తున్నట్లు భావించిన శాలిని.. కంటెస్టెంట్ రోహిత్‌కు స్టేజ్ పైనే ఓపెన్‌గా లవ్ ప్రపోజ్ చేసింది. మొదటి వారం నుంచి వీరిద్దరి మధ్య నడుస్తున్న ఫ్రెండ్‌షిప్, బాండింగ్ సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. శాలిని ఎలిమినేట్ అయిపోయిందని భావించిన రోహిత్ హౌస్‌లో వెక్కి వెక్కి ఏడ్చాడు. శాలిని ఏవీలో కూడా రోహిత్ ప్రయాణమే ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు శాలిని సీక్రెట్ రూమ్‌లో ఉంటూ హౌస్‌మేట్స్ ఆటతీరును గమనిస్తుండటంతో, రోహిత్ గేమ్ ప్లాన్ ఎలా మారబోతోంది? ఆమె రీ-ఎంట్రీ ఇచ్చినప్పుడు హౌస్‌మేట్స్ ఎలా స్పందిస్తారు అనేది రాబోయే ఎపిసోడ్లలో ఆసక్తికరంగా మారనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.