Bigg Boss 10: బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. ఝాన్సీ ఔట్, రోహిత్‌కు సీక్రెట్ రూమ్?

బిగ్ బాస్ తెలుగు 10 ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. సింగర్ ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వెళ్లింది. మరోవైపు రోహిత్ కూడా సీక్రెట్ రూమ్‌కు పంపినట్లు లీకులు వస్తున్నాయి

CR Reddy
Published on: 1 Nov 2026 5:58 AM IST
Jhansi
X

Jhansi

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10 ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వారం సింగర్ ఝాన్సీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. మొదటి నుంచి తన ఆటతీరుతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె బయటకు వెళ్లడం అభిమానులకు షాక్‌గా మారింది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందునుంచే వార్తలు వస్తున్నాయి. దీంతో ఝాన్సీతో పాటు మరో కంటెస్టెంట్ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్తారా? అనే ఆసక్తి పెరిగింది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సుధీర్‌ను కాపాడిన ముఖేష్ పవర్

ఈ వారం ఎలిమినేషన్‌లో సుధీర్ పేరు కూడా బలంగా వినిపించింది. ఓటింగ్‌లో అతనికి తక్కువ ఓట్లు వచ్చినట్లు ప్రచారం జరగడంతో హౌస్ నుంచి బయటకు వెళ్తాడని అనుకున్నారు. కానీ ముఖేష్ తన దగ్గరున్న స్పెషల్ పవర్‌ను ఉపయోగించి సుధీర్‌ను కాపాడాడు.. ఈ ప్రక్రియలో ఝాన్సీ దగ్గరున్న సేవ్ చేసుకునే అవకాశానికి సంబంధించిన పవర్ కూడా కీలకంగా మారింది. సుధీర్‌ను కాపాడే క్రమంలో ఝాన్సీ తనకు ఉపయోగపడే అవకాశాన్ని కోల్పోయింది. చివరకు అదే ఆమె ఎలిమినేషన్‌కు కారణమైందనే చర్చ నడుస్తోంది.

రోహిత్‌కు ఎలిమినేషన్ షాక్

ఇక రెండో ఎలిమినేషన్ విషయంలో రోహిత్ పేరు తెరపైకి వచ్చింది. రోహిత్, రామకృష్ణలకు సమానంగా ఓట్లు వచ్చినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎవరిని హౌస్ నుంచి పంపించాలనే నిర్ణయాన్ని గేమ్‌లో కీలక స్థానంలో ఉన్న త్రిగుణ్‌కు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. రోహిత్, త్రిగుణ్ మధ్య గతంలోనూ మాటల యుద్ధం నడిచింది. టైటిల్ గెలుస్తానని ధీమాగా మాట్లాడిన రోహిత్‌కు ఇప్పుడు ఎలిమినేషన్ ముప్పు రావడం ఆసక్తికరంగా మారింది. అయితే అతడిని నిజంగానే ఎవరి నిర్ణయంతో బయటకు పంపారనే విషయం ఇంకా స్పష్టంగా లేదు.

ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌కు?

రోహిత్ విషయంలో మరో ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. అతడిని ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించినా, నేరుగా ఇంటికి పంపకుండా సీక్రెట్ రూమ్‌లోకి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే షాలినిని సీక్రెట్ రూమ్‌కు పంపించి తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రోహిత్‌కు కూడా అలాంటి అవకాశం ఇచ్చారా? అనేది చర్చనీయాంశంగా మారింది. నిజమైతే ఒకే సీజన్‌లో ఇద్దరు కంటెస్టెంట్లను వేర్వేరు సందర్భాల్లో సీక్రెట్ రూమ్‌కు పంపిన ఆసక్తికర పరిణామం అవుతుంది. అయితే ఇది అధికారికంగా నిర్ధారణ కాలేదు.

హౌస్‌లో మారనున్న ఆట లెక్కలు

ఝాన్సీ బయటకు వెళ్తే సుధీర్, ముఖేష్, వర్షిణి గ్రూప్ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు రోహిత్ సీక్రెట్ రూమ్‌లో ఉంటే తిరిగి హౌస్‌లోకి వచ్చి ఆటను మార్చే ఛాన్స్ ఉంటుంది. అతడికి మరో అవకాశం దక్కుతుందా? లేక షాలిని తరహాలో తిరిగి వచ్చినా నిలబడలేకపోతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.