Bigg Boss 10: ఆడదానితో గెలిచి రచ్చ చేస్తున్నారంటూ వర్షిణి ఫైర్.. రోహిత్, త్రిగున్‌లకు షాక్

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 17వ రోజు ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా, ఉద్విగ్నభరితంగా సాగింది.

CR Reddy
Published on: 24 Sept 2026 10:44 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 17వ రోజు ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా, ఉద్విగ్నభరితంగా సాగింది. ఇంటి సభ్యుల భావోద్వేగాలతో ఆడుకునేలా బిగ్ బాస్ ప్రవేశపెట్టిన టెంప్టేషన్ టాస్కులు కంటెస్టెంట్లను తీవ్ర కంటతడి పెట్టించాయి. కుటుంబ సభ్యులు ప్రేమగా పంపించిన ఉత్తరాలు లేదా జ్ఞాపకాలు కావాలంటే తోటి సభ్యులకు టెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ముకేశ్ చేసిన పనికి దేబ్జానీ ఏడ్చినప్పటికీ, నరేష్, రామ్ ప్రసాద్ ఆమెను నవ్వించే ప్రయత్నం చేయడం ఇంటి వాతావరణాన్ని కాస్త తేలికపరిచింది. ఇక ముకేశ్‌కు తన తండ్రితో ఉన్న ఫొటో అందించి బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ఇవ్వగా, ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

అమన్, సృష్టిల విజయం.. రోహిత్, త్రిగున్‌లకు హ్యాండ్

కెప్టెన్సీ కంటెండర్ రేసు కోసం నిర్వహించిన టెంప్టేషన్ టాస్కుల్లో హౌస్‌మేట్స్ హోరాహోరీగా తలపడ్డారు. స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో వర్షిణిపై గెలుపొంది అమన్ విజేతగా నిలవగా, మరో వైపు సుధీర్‌తో జరిగిన పోటీలో సృష్టి విజయం సాధించి కంటెండర్‌గా నిలిచారు. అయితే టాస్క్‌లో గెలిచిన అమన్, సృష్టిలకు బిగ్ బాస్ ఒక కఠినమైన షరతు పెట్టారు. తమ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఇష్టమైన భోజనం లేదా ఉత్తరాలు పొందాలంటే, హౌస్‌లోని తోటి సభ్యుల లేఖలను నాశనం చేయాలని చెప్పారు. దీంతో అమన్.. రోహిత్‌కు రాసిన ఉత్తరాన్ని, సృష్టి.. త్రిగుణ్‌కు వచ్చిన లేఖను నాశనం చేశారు. దీనివల్ల రోహిత్, త్రిగుణ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

నరేష్‌ను ఆ పేరుతో పిలవొద్దంటూ సీరియస్

హౌస్‌లో కెప్టెన్ ఝాన్సీ వ్యవహారశైలిపై, ఇతర కంటెస్టెంట్ల ప్రవర్తనపై చర్చలు నడిచాయి. ఈ క్రమంలో నరేష్‌ను కొందరు పొట్టోడు అని పిలవడంపై త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలాంటి వ్యక్తిని అలా పిలవడం సరికాదని చెప్పగా, రామ్ ప్రసాద్, వర్షిణి స్పందిస్తూ తాము ప్రేమగా పిలుచుకుంటామని, అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ అంశంపై ఇంట్లో కొంత వాదన జరగడంతో వాతావరణం వేడెక్కింది. మరోవైపు వంట సమయంలో చేతికి ప్లాస్టర్ వేసుకోవాలని నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్‌ను కెప్టెన్ ఝాన్సీ మరోసారి గుర్తుచేయడం, ఆపై బిగ్ బాస్ ప్లాస్టర్లు పంపించడం జరిగాయి.

వర్షిణి ఫైర్, సోషల్ మీడియాలో చర్చ

అమన్‌తో జరిగిన ఫిజికల్ టాస్క్ సమయంలో వర్షిణి, అమన్ గట్టిగా ప్రయత్నించారు. ఈ క్రమంలో అమన్ తనను కౌగిలించుకున్నట్లు బంధించాడని, ఆడదానితో గెలిచి రచ్చ చేస్తున్నారని వర్షిణి అసహనం వ్యక్తం చేసింది. అయితే అమన్ కావాలని అలా చేయలేదని, టాస్క్‌లో భాగంగానే ఇద్దరూ పోరాడారని తోటి సభ్యులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ 17వ రోజు ఎపిసోడ్ ఆటపాటలతో పాటు కంటతడి పెట్టించే ఎమోషన్స్‌తో సాగిపోయింది. రాబోయే రోజుల్లో కెప్టెన్సీ కోసం పోటీ మరింత రంజుగా మారుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.