Bigg Boss 10: అమన్ విజయాన్ని లాగేసుకున్న వర్షిణి.. బిగ్ బాస్ షోలో రసవత్తరంగా మారిన గేమ్

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు పదవ సీజన్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్సీ టాస్క్‌లో అమన్ గెలిచినప్పటికీ, వర్షిణి తన మ్యాజిక్ కీ పవర్‌ను ఉపయోగించి ఆ కేప్టెన్సీని దక్కించుకుంది.

CR Reddy
Published on: 3 Oct 2026 6:56 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు పదవ సీజన్ ప్రారంభం నుంచి రకరకాల వ్యూహాలు, ఆశ్చర్యకరమైన పరిణామాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మేకర్స్ ముందుగా చెప్పినట్టుగానే ప్రతి వారం ఆటలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన పరిణామాలు హౌస్‌లోని కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను సైతం షాక్‌కు గురిచేశాయి. చివరి వరకు కష్టపడి ఆడి కెప్టెన్సీని దక్కించుకున్న కంటెస్టెంట్‌కు చివరి నిమిషంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

మ్యాజిక్ కీ పవర్‌తో మారిన సీన్

నాలుగో వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగిన హోరాహోరీ పోరులో అమన్ విజయం సాధించాడు. టాస్క్ గెలిచిన సంతోషంలో అమన్ గట్టిగా విజయనాదం చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. అయితే ఆట ముగిసిన వెంటనే బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ కీని పంపించాడు. ఆ కీ వర్షిణి సౌందరరాజన్‌కు చెందిన పవర్‌ను అన్ లాక్ చేసింది. ఆ పవర్ ద్వారా ఎవరైనా గెలిచిన విజయాన్ని లేదా పవర్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. సరిగ్గా ఇదే అవకాశాన్ని వాడుకున్న వర్షిణి, అమన్ కష్టపడి సాధించిన కెప్టెన్సీని తన సొంతం చేసుకుంది. తనకు మద్దతుగా నిలిచిన తోటి సభ్యుల సహాయంతో ఆమె ఇంటి కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.

రోహిత్, అమన్ మధ్య విభేదాలు

కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక సమయంలో హౌస్‌లో పెద్ద గొడవలే జరిగాయి. భైరవ రెడ్ టీమ్‌కు చెందిన సభ్యుల మధ్య ఎవరు పోటీకి వెళ్లాలనే అంశంపై తీవ్ర చర్చలు నడిచాయి. రోహిత్ వద్దన్నా సన్నని వాదనల మధ్య అమన్ కెప్టెన్సీ పోరుకు సిద్ధమయ్యాడు. చివరకు అమన్ గెలిచినప్పటికీ, వర్షిణి మ్యాజిక్ పవర్ వాడి ఆ విజయాన్ని లాగేసుకోవడంతో రోహిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ అగ్నిపరీక్ష బ్యాచ్‌కు అన్యాయం జరుగుతోందని అమన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పరిణామాలు హౌస్‌‌లో గ్రూప్ రాజకీయాలకు మరింత అజంపోశాయి.

ఓటింగ్ ట్రెండ్స్‌లో దూసుకుపోతున్న త్రిగుణ్

ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో నిలిచారు. త్రిగుణ్, రోహిత్, ముఖేష్, శాలిని, చరణ్, సృష్టి, నరేష్, దేబ్జానీ, అమన్ నామినేషన్లలో ఉన్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే టాలెంటెడ్ నటుడు త్రిగుణ్ మిగతా కంటెస్టెంట్ల కంటే ఎంతో ముందు వరుసలో కొనసాగుతున్నాడు. అతనికి వస్తున్న ఓటింగ్ శాతం దాదాపు యాభై శాతానికి దగ్గరగా ఉండటం విశేషం. మిగతా వాళ్ల ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. తోటి కంటెస్టెంట్లు కొందరు త్రిగున్‌‌ను టార్గెట్ చేయడం వల్లనే ఆయనకు ప్రజల నుంచి మద్దతు అమాంతం పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇమ్యూనిటీ ఛాలెంజ్‌లో సత్తా చాటిన సభ్యులు

ఆటను రక్తి కట్టించేందుకు బిగ్ బాస్ హౌస్‌లో కత్తుల (డాగర్స్) టాస్క్‌ను ప్రవేశపెట్టారు. ఎవరి దగ్గరైతే డాగర్స్ ఉంటాయో వారు ఇమ్యూనిటీ ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులు తమ వ్యూహాలను అమలు చేశారు. చివరకు జరిగిన ఇమ్యూనిటీ పోటీలలో వంశీ, సుధీర్ విజయం సాధించి రాబోయే ఐదవ వారం కోసం ఇమ్యూనిటీని సొంతం చేసుకున్నారు. వరుస ట్విస్టులు, గొడవలతో సాగుతున్న ఈ రియాలిటీ షో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.