Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్.. రోజుకు 10 కేజీల స్వీట్స్ తింటానంటూ కామెంట్స్

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ ఎంతో ఉత్కంఠభరితంగా ముగిసింది.

CR Reddy
Published on: 21 Sept 2026 6:58 AM IST
Krishnudu
X

Krishnudu

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ ఎంతో ఉత్కంఠభరితంగా ముగిసింది. అందరూ ఊహించినట్లుగానే ఆదివారం నాటి సండే ఎపిసోడ్‌లో కృష్ణుడు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. చివరి రౌండ్‌లో సృష్టి అలాగే కృష్ణుడు మిగలగా, వీరిద్దరిలో కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ ఎలిమినేషన్ ప్రకటన వెలువడిన వెంటనే హౌస్‌లోని సభ్యులందరూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా కృష్ణుడు తోటి హౌస్‌మేట్స్‌కు వీడ్కోలు చెప్పే సమయంలో అందరి కళ్లలో నీళ్లు తెప్పించారు.

తొలి వారంలో చిన్నపాటి గొడవలు పడినప్పటికీ, రోహిత్ మాత్రం కృష్ణుడు వెళ్లిపోతుంటే తనను ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు. “మీ కళ్లు అచ్చం మా నాన్నగారి కళ్లలాగే ఉంటాయి” అంటూ రోహిత్ భావోద్వేగంతో ఏడవడంతో కృష్ణుడు కూడా చలించిపోయారు. కోపంలో తాను సరిగ్గా వ్యవహరించలేకపోయానని క్షమాపణలు చెబుతూ రోహిత్‌ను హత్తుకున్నారు. మరో కంటెస్టెంట్ త్రిగుణ్ సైతం కృష్ణుడిని పట్టుకుని బోరున ఏడ్చేశారు. హౌస్‌లో ఉన్నంతకాలం అందరితోనూ కలివిడిగా ఉండే కృష్ణుడు బయటకు వెళ్తుంటే మిగతా సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు.

స్టేజ్ మీదకు వచ్చిన కృష్ణుడితో నాగార్జున సరదాగా మాట్లాడుతూనే ఆయన ప్రయాణం గురించి చర్చించారు. ఈ సందర్భంగా తన ఎలిమినేషన్‌కు గల అసలు కారణం గురించి కృష్ణుడు అందరికీ షాకింగ్ నిజం చెప్పారు. గత ఎనిమిది రోజులుగా తాను స్వీట్లు అలాగే షుగర్ తీసుకోవడం పూర్తిగా మానేశానని, దానివల్ల శరీరం తీవ్రంగా నీరసించిపోయిందని తెలిపారు. సాధారణంగా రోజుకు పది కేజీల స్వీట్లు తినే అలవాటు ఉన్న తనకు, సడెన్‌గా షుగర్ బంద్ చేయడం హెల్త్ పై తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే తాను గేమ్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయానని వెల్లడించారు. దీనిపై స్పందించిన నాగార్జున, ఇకపై ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక హౌస్‌లోని మిగతా సభ్యుల గురించి చెబుతూ కృష్ణుడు కొందరిని పాజిటివ్ అని, మరికొందరిని నెగెటివ్ అని వర్గీకరించారు. దేబ్జానీ, ఝాన్సీ, సృష్టి, అమన్‌లను పాజిటివ్ పీపుల్‌గా చెప్పిన ఆయన, సుధీర్, ముఖేష్, వర్షిణి, చరణ్‌లను నెగెటివ్ పీపుల్‌గా పేర్కొన్నారు. సండే ఎపిసోడ్ కావడంతో హౌస్‌లో ఫన్ యాక్టివిటీస్ జరిగాయి. అమన్ అలాగే త్రిగుణ్ రాప్ సాంగ్స్ తో అదరగొట్టగా, దేబ్జానీ, ముఖేష్ రొమాంటిక్ డ్యాన్స్‌తో స్టేజ్‌ను హోరెత్తించారు. మొత్తానికి రెండో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.