Bigg Boss 10: బిగ్ బాస్ 10 హౌస్‌లో హైడ్రామా.. చెంప చెళ్లుమనేలా కొట్టుకున్న టెంపర్ వంశీ
Bigg Boss 10: బుల్లి తెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10లో గురువారం ఎపిసోడ్ ఎన్నో భావోద్వేగాలు, ఉద్వేగభరిత సన్నివేశాలతో సాగింది.
Temper Vamsi
Bigg Boss 10: బుల్లి తెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10లో గురువారం ఎపిసోడ్ ఎన్నో భావోద్వేగాలు, ఉద్వేగభరిత సన్నివేశాలతో సాగింది. రోజురోజుకూ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ తత్వంతో పాటు వ్యక్తిగత విభేదాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. గురువారం నాటి ఆటలో ముఖ్యంగా టెంపర్ వంశీ ఓటమిని తట్టుకోలేక చేసిన రచ్చ, రోహిత్, షాలిని మధ్య జరిగిన తీవ్ర స్థాయి బ్రేకప్ సంభాషణ ప్రేక్షకులు, నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ముందుగా బిగ్ బాస్ హౌస్‌లో శివకుమార్, టెంపర్ వంశీ మధ్య అత్యంత ఆసక్తికరమైన టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో గెలవాలంటే శారీరక శ్రమ కంటే తెలివితేటలు, మైండ్ గేమ్ చాలా అవసరం. టేబుల్ పైన ప్లేట్, బౌల్ రెండింటినీ సరిగ్గా ఉంచి పట్టుకున్న వారే విజేతగా నిలుస్తారని బిగ్ బాస్ ప్రకటించారు. ఆట సమయంలో ప్లేట్ శివకుమార్ చేతిలో ఉండగా, బౌల్ వంశీ చేతిలో ఉంది. శివకుమార్ ఎంతో చురుగ్గా ఆలోచించి ముందుగా ప్లేట్‌ను టేబుల్‌పై ఉంచి, ఆపై బౌల్‌ను కూడా పట్టుకుని సమర్థవంతంగా టాస్క్‌ను పూర్తి చేశాడు. కానీ వంశీ మాత్రం చిన్న పొరపాటు వల్ల బౌల్ టేబుల్‌పై ఉంచి చేతులు వదిలేశాడు. దీంతో శివకుమార్ విజేతగా నిలిచినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.
చేతికి వచ్చిన విజయాన్ని సొంత తెలివితక్కువతనం వల్ల పోగొట్టుకున్నానని గ్రహించిన వంశీ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఓటమి బాధ తట్టుకోలేక భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. మైండ్ గేమ్ సరిగ్గా ఆడలేకపోయాననే కోపంతో హౌస్మేట్స్ అందరి ముందే తన చెంపలను తానే గట్టిగా వాయించుకున్నాడు. తనని తాను శిక్షించుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. వంశీ పడుతున్న ఆవేదనను చూసి సహచర కంటెస్టెంట్ త్రిగుణ్ దగ్గరకు వచ్చి అతడిని పట్టుకుని ఓదార్చడానికి ప్రయత్నించాడు.
మరోవైపు హౌస్‌లో లవ్ ట్రాక్‌గా కొనసాగుతున్న రోహిత్, షాలిని మధ్య ఊహించని రీతిలో పెద్ద గొడవ జరిగింది. షాలిని ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న రోహిత్ ఆమెపై విరుచుకుపడ్డాడు. "నీతో మాట్లాడాలని కూడా నాకు లేదు. అసలు కనీస సహనం లేని వ్యక్తి మన జీవితంలో ఉండడమే ఒక వేస్ట్" అంటూ రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. "ఎవరో ఎవరి గురించో చెప్పిన అనవసర విషయాలను సొంతంగా ఆలోచించకుండా తలకు ఎక్కించుకుంటున్నావు, ఇకపై నా ముఖం కూడా నీకు చూపించను" అంటూ తేల్చి చెప్పేశాడు. దీంతో వీరిద్దరి మధ్య బంధం బ్రేకప్ దశకు చేరినట్లు స్పష్టంగా కనిపించింది.
ఈ ఉద్రిక్తతల అనంతరం హౌస్‌లో గ్రీన్ టీమ్, వైల్డ్ ఫైర్స్ టీమ్‌ల మధ్య కీలకమైన టాస్క్ నిర్వహించారు. గ్రీన్ టీమ్ నుంచి అమన్, ముకేష్ పోటీ పడగా, వైల్డ్ ఫైర్స్ టీమ్ తరఫున ఆర్కే, దక్షి పాల్గొని శ్రమించారు. టాస్క్ ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ, చివరికి పక్కా ప్రణాళికతో ఆడిన గ్రీన్ టీమ్ సభ్యులు విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు. ఈ ఓటమితో వైల్డ్ ఫైర్స్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.




