Bigg Boss 10: హౌస్‌లో హైడ్రామా.. వంశీ-రోహిత్ మధ్య రచ్చ, దేబ్జానీకి బంపర్ ఛాన్స్
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పదో రోజు ఆట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
Bigg Boss 10
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పదో రోజు ఆట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఉత్కంఠభరితమైన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌తో మొదలైన ఈ రోజు ఆటలో కిచెన్ గొడవలు, ఫిజికల్ టాస్క్‌ల హోరాహోరి, సంచాలకుడి నిర్ణయాలపై తీవ్ర వివాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వంశీ, రోహిత్ మధ్య జరిగిన వాగ్వాదం హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని, హైడ్రామాను అందించింది.
యానిమల్ పార్క్ టాస్క్
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో వంశీ, సృష్టి సంచాలకులుగా వ్యవహరించగా.. అమన్–షాలిని ఒక జట్టుగా, ముఖేష్–ఝాన్సీ మరో జట్టుగా పోటీ పడ్డారు. ఇందులో జంతువుల హావభావాలను అనుకరిస్తూ ఆడాల్సిన ఈ గేమ్‌లో ఝాన్సీ తన అద్భుతమైన క్లారిటీతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె సైగలతో జంతువుల పేర్లను ఇటుకలతో సరిగ్గా అమర్చి ముఖేష్, ఝాన్సీ జోడీ ఈజీగా విజయం సాధించింది. ఓడిపోయిన అమన్-షాలిని జంట నుంచి అమన్‌ను కెప్టెన్సీ రేసు నుంచి పూర్తిగా తప్పించారు.
వంశీ - రోహిత్ మధ్య మాటామాటా
హౌస్‌లో త్రిగుణ్–రామ్ ప్రసాద్ ఒక జట్టుగా, రోహిత్–దేబ్జానీ మరో జట్టుగా బరిలోకి దిగిన ఫిజికల్ టాస్క్ టెన్షన్‌ను నెక్ట్స్ లెవల్ కు పెంచింది. పై నుంచి పడుతున్న బంతులను అందుకోవడానికి జరిగిన ఈ పోరులో త్రిగుణ్, రామ్ ప్రసాద్ విజయం సాధించారు. అయితే ఈ టాస్క్‌లో సంచాలకుడిగా వ్యవహరించిన వంశీ తీరుపై రోహిత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరి విలన్ రోల్‌ను తలపించేలా వంశీ రియాక్ట్ కావడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
దేబ్జానీకి పట్టిన అదృష్టం
ఫిజికల్ టాస్క్‌లో ఓడిపోయిన రోహిత్, దేబ్జానీలలో ఒకరు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రోహిత్ తన కోసం తప్పుకోవాలని దేబ్జానీని కోరగా, ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. తాను కూడా పోటీ పడగలనంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. చివరకు విజేతలైన త్రిగుణ్, రామ్ ప్రసాద్ చర్చించి రోహిత్‌ను రేసు నుంచి తప్పించడంతో దేబ్జానీకి లక్కీ ఛాన్స్ దక్కింది. త్రిగుణ్, రామ్ ప్రసాద్‌లతో పాటు దేబ్జానీ కూడా కెప్టెన్సీ రేసులో నిలవడంతో రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.




