Avengers Endgame Encore: రీ రిలీజ్‌లోనూ ఎండ్‌గేమ్ రచ్చ.. బుకింగ్స్ మామూలుగా లేవు.!

Avengers Endgame Encore: మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ రీ రిలీజ్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి...

G Krishna
Published on: 20 Sept 2026 5:37 PM IST
Avengers Endgame Encore
X

Avengers Endgame Encore: రీ రిలీజ్‌లోనూ ఎండ్‌గేమ్ రచ్చ.. బుకింగ్స్ మామూలుగా లేవు.!

Avengers Endgame Encore : మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ రీ రిలీజ్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్లలో మరోసారి సందడి చేయనున్న ఈ సినిమా.. విడుదలకు ముందే భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మల్టీప్లెక్స్ చైన్లలో బుకింగ్స్‌కు మంచి స్పందన రావడంతో.. రీ రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఎండ్‌గేమ్ మరోసారి తన సత్తా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫస్ట్ డే బుకింగ్స్ ఎంతంటే?

మీడియా నివేదికల ప్రకారం.. PVR ఇనాక్స్, సినీపోలిస్ వంటి ప్రముఖ సినిమా చైన్లలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’కు మొదటి రోజు కోసం వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తం ప్రారంభ వారాంతానికి దాదాపు 1.25 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనట్లు సమాచారం. ఇందులో సుమారు 50 వేల టికెట్లు తొలి రోజుకే అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ బుకింగ్స్ ద్వారా సినిమా దాదాపు రూ.6.25 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు అంచనాలు ఉన్నాయి.

ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండొచ్చు?

విడుదలకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ రావడం ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుత బుకింగ్స్ ట్రెండ్‌ను బట్టి చూస్తే.. సినిమా తొలి రోజు ఇండియాలో సుమారు రూ.20 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఇది కొత్త సినిమా కాకపోవడంతో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది విడుదల తర్వాతే స్పష్టమవుతుంది. గతంలో చూసిన సినిమానే అయినప్పటికీ.. పెద్ద స్క్రీన్‌పై ‘ఎండ్‌గేమ్’ను మరోసారి చూడాలనుకునే అభిమానుల సంఖ్య ఈ రీ రిలీజ్‌కు ప్లస్‌గా మారుతోంది.

ఇండియాలో ఎండ్‌గేమ్ రికార్డ్ ఏంటి?

2019లో విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ అప్పట్లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టించింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని కీలక పాత్రలకు ముగింపు పలికిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో భారీ ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వంటి సినిమాలు ఆ రికార్డును అధిగమించాయి.

ఇప్పుడు ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’ మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో.. ఈ సినిమా కొత్త రికార్డులు సాధిస్తుందా, పాత రికార్డులకు దగ్గరవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం మార్వెల్ అభిమానుల్లో సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరోసారి చూపిస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.