Anupama Parameswaran: పెళ్లికి ముందే బిడ్డ కావాలనే కోరిక ఉండేది.. అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు

Anupama Parameswaran: తనకు పెళ్లికి ముందే ఒక బిడ్డను పెంచుకోవాలనే కోరిక ఉండేదని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.

Ravi
By Ravi
Published on: 16 Oct 2026 9:46 PM IST
Anupama Parameswaran
X

Anupama Parameswaran: పెళ్లికి ముందే బిడ్డ కావాలనే కోరిక ఉండేది.. అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు

Anupama Parameswaran: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 'క్రేజీ కళ్యాణం' సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె పంచుకున్న వ్యక్తిగత విషయాలు సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. తనకు పెళ్లికి ముందే ఒక బిడ్డను పెంచుకోవాలనే కోరిక ఉండేదని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. 'క్రేజీ కళ్యాణం' సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ వివాహ వ్యవస్థ అలాగే కుటుంబ బంధాలపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవడానికి పెళ్లి అనేది అవసరమేనని ఆమె స్పష్టం చేశారు. కానీ అమ్మాయిని కేవలం ఇంటిలో పనిమనిషిగా మార్చడానికి పెళ్లి చేసుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల సమాజంలో ఉండే కొన్ని మూస ధోరణులను ఆమె ఈ సందర్భంగా గట్టిగా ప్రశ్నించారు.

తన ఇంట్లో కూడా పెళ్లి గురించి ఎలాంటి ఒత్తిడి లేదని, భవిష్యత్తులో అది ఎప్పుడు జరుగుతుందో తనకు కూడా క్లారిటీ లేదని అనుపమ వెల్లడించారు. అయితే పెళ్లితో సంబంధం లేకుండా ఒక పాపనో, బాబునో దత్తత తీసుకోవడం ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా పెంచుకోవాలనే కోరిక బలంగా ఉండేదని పేర్కొన్నారు. అడాప్షన్ లేదా ఐవీఎఫ్ ద్వారా ఇది సాధ్యమే కదా అని ఆమె నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. సమాజంలో వివాహంపై ఉన్న సాంప్రదాయ భావనలకు భిన్నంగా ఆమె చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ఆలోచనలను స్వాగతిస్తుంటే, మరికొందరు సాంప్రదాయ కుటుంబ వ్యవస్థపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రముఖ నటి తన వ్యక్తిగత జీవితం గురించి ఇంత స్పష్టంగా మాట్లాడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.