17 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి.. విలన్‌గా అక్షయ్ కుమార్, హీరోగా సైఫ్ అలీ ఖాన్!

Haiwaan: అక్షయ్ కుమార్ , సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'హైవాన్' (Haiwaan).

Srinivas Rao
Published on: 27 Jun 2026 6:09 PM IST
Haiwaan
X

17 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి.. విలన్‌గా అక్షయ్ కుమార్, హీరోగా సైఫ్ అలీ ఖాన్!

Haiwaan: అక్షయ్ కుమార్ , సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'హైవాన్' (Haiwaan). ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ సినిమా..

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కెరీర్‌లో 60వ చిత్రంగా రాబోతున్న 'హైవాన్', ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించనుంది. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ , థెస్పియన్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2016లో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన మలయాళ సూపర్ హిట్ 'ఒప్పమ్' (Oppam) చిత్రానికి ఇది ప్రేరణ అని దర్శకుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, ఒరిజినల్ కథకు కొన్ని మార్పులు చేసి, స్క్రీన్ ప్లే , సంభాషణల్లో సరికొత్త మెరుగులు దిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ సినిమాలో మోహన్‌లాల్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.

అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో..

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ భయంకరమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ చూపు లేని సంగీత ఉపాధ్యాయుడి పాత్రలో నటిస్తున్నారు. ఒక చిన్నారిని కాపాడే క్రమంలో హీరో , విలన్ మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం. తన పాత్ర గురించి సైఫ్ మాట్లాడుతూ, "ప్రియదర్శన్ గారి దర్శకత్వంలో నటించడం అద్భుతమైన అనుభవం. ప్రతిరోజూ ఏదో కొత్తగా చేయడానికి అవకాశం ఉంది. ఇందులో యాక్షన్, డ్రామాతో పాటు ఎమోషనల్ అంశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి" అని చెప్పారు.

ఈ చిత్రం ఎందుకు ప్రత్యేకమైనదంటే, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ , దర్శకుడు ప్రియదర్శన్ వంటి హేమాహేమీలు ఈ సినిమా కోసం మొదటిసారిగా ఒకే వేదికపైకి రావడం విశేషం. ముఖ్యంగా, 'టషాన్' (2008) చిత్రం తర్వాత దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అక్షయ్ కుమార్ , సైఫ్ అలీ ఖాన్ మళ్ళీ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. వీరితో పాటు సయామీ ఖేర్ , శ్రియా పిల్గాంకర్ వంటి నటీమణులు కీలక పాత్రల్లో కనిపించబోతుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 11న విడుదల కానుండటంతో, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story